News November 30, 2024
రామప్ప, సోమశిలకు రూ.142 కోట్లు: కిషన్ రెడ్డి
TG: యూనెస్కో గుర్తింపు పొందిన రామప్ప, సోమశిల అభివృద్ధికి రూ.142 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఎస్ఏఎస్‌సీఐ స్కీమ్‌తో రెండింటిని డెవలప్ చేయనున్నట్లు పేర్కొన్నారు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. కాగా ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు 23 రాష్ట్రాల్లో 40 ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం తెలిపింది.
Similar News
News December 11, 2024
మేము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా?: కేటీఆర్
TG: చేతి గుర్తుకు ఓటేస్తే చేతకాని CMను తెలంగాణ నెత్తిపై రుద్దారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి KTR లేఖ రాశారు. తెలంగాణ బతుకు ఛిద్రం అవుతుంటే ప్రేక్షకపాత్ర వహిస్తారా? అని ప్రశ్నించారు. తాము పదేళ్లలో పేదల బతుకులు మార్చాం తప్ప పేర్లు, విగ్రహాలు మార్చలేదన్నారు. తాము తలుచుకుంటే రాజీవ్ పేర్లు, ఇందిరా విగ్రహాలు ఉంటాయా అని ప్రశ్నించారు. ఈ నీచ సంస్కృతికి ముగింపు పలకకపోతే జరగబోయేది అదేనని హెచ్చరించారు.
News December 11, 2024
రాష్ట్రంలో 50 లక్షల మంది వివరాలు మిస్సింగ్
AP: రాష్ట్రంలో 50 లక్షల మంది వివరాలు లేవని కలెక్టర్ల సదస్సులో ప్రభుత్వం ప్రకటన చేసింది. మొత్తం 5.4 కోట్ల మంది జనాభాకు 4.9 కోట్ల మంది వివరాలే ఉన్నాయని వెల్లడించింది. మిగతా వారి వివరాలు తమ వద్ద లేవని పేర్కొంది. గత సర్వేల్లో చేసిన వివరాలు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని అధికారులు తెలిపారు. ఇంటింటి సర్వే ద్వారా అందరి వివరాలు నమోదు చేయాలని సీఎం సూచించారు.
News December 11, 2024
GOOD NEWS.. ప్రభుత్వం కొత్త పథకం
గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్ల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకురానుంది. ఇప్పటివరకు వారికి ఎలాంటి ఉద్యోగ ప్రయోజనాలు, సామాజిక భద్రత లేవు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఈ-కామర్స్, సేవా రంగానికి మరింత ఊతం ఇచ్చేలా ఓ పథకం రూపొందిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ కార్యదర్శి సుమితా దావ్రా తెలిపారు. వారికి పెన్షన్, ఆరోగ్య బీమా వంటి సౌకర్యాలు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో 70 లక్షల మంది వర్కర్లు ఉన్నట్టు అంచనా.