News December 19, 2024
శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం
AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 15గంటల సమయం పడుతోంది. వేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 16 కాంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 70,457 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.16కోట్లు వచ్చినట్లు టీటీడీ తెలిపింది.
Similar News
News January 17, 2025
సైఫ్ అలీఖాన్ గురించి తెలుసా?
సైఫ్ 1970లో మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ, షర్మిలా ఠాగూర్ దంపతులకు జన్మించారు. పటౌడీ భారత క్రికెట్ జట్టుకు సారథిగా వ్యవహరించారు. సైఫ్ 1991లో నటి అమృత సింగ్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. వారే సారా అలీ ఖాన్, ఇబ్రహీం అలీ ఖాన్. సారా పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. 2012లో సైఫ్ కరీనా కపూర్‌ను పెళ్లాడారు. వీరికి తైమూర్, జహంగీర్ జన్మించారు. సైఫ్ ఆస్తి సుమారు రూ.1,200 కోట్లు ఉంటుంది.
News January 17, 2025
లోకల్ ఛానల్స్‌లో పైరసీ మూవీలు.. దిల్ రాజు వార్నింగ్
ప్రైవేటు వెహికల్స్, లోకల్ ఛానల్స్‌లో అనుమతి లేకుండా కొత్త సినిమాలను ప్రదర్శిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్మాత, తెలంగాణ FDC ఛైర్మన్ దిల్ రాజు హెచ్చరించారు. ఇటీవల కొత్త సినిమాలను పర్మిషన్ లేకుండా ప్రదర్శిస్తున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు. ఇలా అక్రమంగా ప్రదర్శించడం వల్ల సినిమాలపై ఆధారపడి జీవిస్తున్న వారికి నష్టం వాటిల్లుతుందన్నారు.
News January 17, 2025
PHOTO: భార్య, కూతుళ్లతో YS జగన్
ఏపీ మాజీ సీఎం జగన్ తన ఫ్యామిలీ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. లండన్‌లో డిగ్రీ పూర్తిచేసిన తన కూతురు వర్షారెడ్డికి అభినందనలు తెలిపారు. ‘కంగ్రాట్స్ డియర్. ప్రతిష్ఠాత్మక కింగ్స్ కాలేజీ నుంచి మంచి మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి మమ్మల్ని గర్వపడేలా చేశావు. నీకు దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’ అని రాసుకొచ్చారు. తన భార్య భారతి, కూతుళ్లు హర్షారెడ్డి, వర్షారెడ్డితో దిగిన ఈ ఫొటో వైరలవుతోంది.