News March 18, 2024
లిక్కర్ స్కామ్‌లో 15 మంది అరెస్ట్: ఈడీ
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో 15 మందిని అరెస్ట్ చేసినట్లు ఈడీ తెలిపింది. ఇప్పటివరకు ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలతో సహా 245 ప్రాంతాల్లో సోదాలు చేసినట్లు వెల్లడించింది. ఢిల్లీ ప్రత్యేక కోర్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను 7 రోజుల కస్టడీకి అనుమతించిందని పేర్కొంది. మరోవైపు కవితను కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావు ఈడీ కార్యాలయానికి వెళ్లారు.
Similar News
News September 14, 2024
తాజ్‌మహల్‌లో వాటర్ లీకేజీ!
భారత పర్యాటకానికి తలమానికమైన తాజ్‌మహల్‌లో నీరు కారుతోంది. ఆగ్రాలో గడచిన రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో ప్రధాన డోమ్ నుంచి నీరు లీకవుతోందని పురావస్తు అధికారులు గుర్తించారు. అయితే పెద్దగా సమస్యలేవీ కనిపించలేదని, వెంట్రుకవాసి పరిమాణంలో ఓ బీటను గుర్తించామని తెలిపారు. డ్రోన్ సాయంతో దాన్ని నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే తగిన మరమ్మతులు చేస్తామని పేర్కొన్నారు.
News September 14, 2024
ట్రాన్స్‌జెండర్ల యూనిఫామ్స్ నమూనా ఇదే!
TG: హైదరాబాద్‌లో ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా ఉపయోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ట్రాఫిక్ వాలంటీర్లుగా పని చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం వేర్వేరు డిజైన్‌లతో విభిన్నమైన యూనిఫామ్స్ రూపొందించడంలో ప్రభుత్వం నిమగ్నమైంది. ఈ మేరకు యూనిఫామ్స్‌కు సంబంధించిన నమూనాను రిలీజ్ చేసింది. ఈ వాలంటీర్లు నగరంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తారని ప్రభుత్వం చెప్పింది.
News September 14, 2024
నైపుణ్యం ఉన్నవారికి గంభీర్ మద్దతు ఉంటుంది: పీయూష్
టీమ్ ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్‌పై స్పిన్నర్ పీయూష్ చావ్లా ప్రశంసలు కురిపించారు. నైపుణ్యం ఉన్న ఆటగాళ్లకు ఆయన మద్దతుగా నిలుస్తారని తెలిపారు. ‘ఆయన ఆటగాళ్లలో స్ఫూర్తి నింపుతారు. స్వేచ్ఛగా ఆడమని చెబుతారు. మీలో టాలెంట్ ఉందని అనిపిస్తే మీరు ప్రదర్శన చేయకపోయినా అండగా నిలిచి అవకాశాలిస్తారు. ఏ ఆటగాడికైనా అదే కావాలి. గ్రౌండ్‌లో దూకుడుగా ఉండే గౌతీ వ్యక్తిగతంగా చాలా సౌమ్యుడు’ అని వెల్లడించారు.