News April 12, 2024
రైల్వే శాఖలో 15శాతం డ్రైవర్ పోస్టులు ఖాళీ

రైల్వే శాఖలో 15% డ్రైవర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని రైల్వే బోర్డు వెల్లడించింది. ఆర్టీఐ ద్వారా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చింది. మొత్తం 1,27,644 డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులు మంజూరు కాగా, అందులో 2024 మార్చి 1 నాటికి 18,766 (14.7%) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. అలాగే 14,429 లోకో పైలట్ పోస్టులు, 4,337 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది.
Similar News
News March 17, 2025
TODAY HEADLINES

* రాజధానికి రూ.11వేల కోట్ల రుణం.. కీలక ఒప్పందం
* అమరావతిలో 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం: సీఎం
* హీరో విశ్వక్ సేన్ ఇంట్లో చోరీ
* KCR జాతిపిత.. రేవంత్ బూతుపిత: హరీశ్‌రావు
* తాగుబోతోడు తెలంగాణకు జాతిపిత అవుతాడా?: రేవంత్
* ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతీ నొప్పి, ఆస్పత్రిలో చేరిక
* యూట్యూబర్ హర్షసాయిపై కేసు నమోదు
* నా బాల్యమంతా తీవ్ర పేదరికంలోనే: PM మోదీ
* IML విజేతగా టీమ్ ఇండియా
News March 17, 2025
IMLT20 విజేతగా ఇండియా మాస్టర్స్

IML T20 లీగ్ విజేతగా టీమ్ ఇండియా అవతరించింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్లో వెస్టిండీస్ మాస్టర్స్‌ను ఇండియా మాస్టర్స్ 6వికెట్ల తేడాతో చిత్తు చేసింది. 149 పరుగుల టార్గెట్‌ను భారత్ 17.1 ఓవర్లలోనే ఛేదించింది. అంబటి రాయుడు 9 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసి జట్టుకు అండగా నిలిచారు. ఆరంభంలో సచిన్ (25) మెరుపులు మెరిపించారు. నర్స్ రెండు వికెట్లు సాధించారు. బెస్ట్, బెన్ చెరో వికెట్ తీశారు.
News March 17, 2025
అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

AP: తూర్పు గోదావరి జిల్లా గోపాలపురంలో డయేరియా ప్రబలడంపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. డయేరియా నివారణకు ఇంటింటి సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే 20 వైద్య బృందాలను ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు వివరించారు.