News August 11, 2024

15 నుంచి రెవెన్యూ సదస్సులు: అనగాని

image

AP: రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి 30 వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ‘ప్రతి గ్రామంలో ఈ సదస్సులు జరుగుతాయి. భూ ఆక్రమణలు, 22ఏ భూముల అక్రమాలతోపాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తాం. ఆ ఫిర్యాదులను విచారణ జరిపి ఆన్‌లైన్ చేసి పరిష్కరిస్తాం’ అని మంత్రి వివరించారు.

Similar News

News March 24, 2026

SRHకు శుభవార్త.. నేడే బెంగళూరుకు కమిన్స్

image

SRH కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్నునొప్పి నుంచి కోలుకున్నారు. దీంతో IPLలో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమతించిందని క్రిక్‌బజ్ వెల్లడించింది. ఆయన ఇవాళే బెంగళూరుకు చేరుకొని జట్టుతో కలుస్తారని తెలిపింది. ఈ నెల 28న RCBతో జరిగే తొలి మ్యాచ్‌లో ఆడతారా లేదా అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే పేసర్ <<19460349>>ఎషాన్ మలింగాకు<<>> శ్రీలంక బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. కమిన్స్ రాకతో SRH బౌలింగ్ విభాగం మరింత బలపడనుంది.

News March 24, 2026

చర్చలు విఫలం.. వెనక్కి తగ్గని జీవన్ రెడ్డి

image

TG: రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌ చేసిన బుజ్జగింపులు విఫలమయ్యాయి. తాను ఏ డిమాండ్లను పీసీసీ ముందు పెట్టలేదని, తన సమస్యకు అధిష్ఠానం వద్ద పరిష్కారం లేదని తెలిపారు. పార్టీ మారొద్దని పీసీసీ చీఫ్ కోరారు కానీ ఎలాంటి హామీ ఇవ్వలేదని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల అనుబంధం వదులుకోవడం బాధగా ఉన్నా తప్పడం లేదన్నారు.

News March 24, 2026

రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం!

image

ఆల్ రౌండర్ రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఖరారైనట్లు సమాచారం. యూపీ ప్రభుత్వం ఆయన్ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెట్ జట్టుకు ఆయన చేస్తున్న సేవలు, నిబద్ధతకు గుర్తింపుగా ఈ అవకాశం ఇవ్వనున్నట్లు ఇండియా టుడే వెల్లడించింది. కాగా ఈ పోస్టు యూపీలో గ్రూప్-A కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ.56,100 నుంచి రూ.1,77,500 చేతికి అందుతుంది.