News December 23, 2024
మహిళా సంఘాల ద్వారా RTCకి 150 ఎలక్ట్రిక్ బస్సులు: సీఎస్
TG: రాష్ట్రంలో తొలి విడతలో 5 జిల్లాల్లోని 231 ఎకరాల్లో స్వయం సహాయక బృందాలచే సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయించాలని సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. 6 నెలల్లో ఆలయ భూముల్లో వీటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. సోలార్ ప్లాంట్లు, ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడంపై అధికారులతో సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల నుంచి ఆర్టీసీకి 150 ఎలక్ట్రిక్ బస్సులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News January 25, 2025
దివ్యాంగుల పెన్షన్ల తొలగింపుపై మంత్రి క్లారిటీ
AP: అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు తొలగించబోమని మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. వైకల్య స్థాయిని నిర్ధారించేందుకే దివ్యాంగులకు వైద్యులతో పరీక్షలు చేయిస్తున్నట్లు వివరించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మొద్దని, అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతినెలా దివ్యాంగులకు రూ.6వేలు, పూర్తిగా మంచంలో ఉన్నవారికి రూ.15వేలు పెన్షన్ అందజేస్తోన్న విషయం తెలిసిందే.
News January 25, 2025
రైతు భరోసా.. వాళ్లకు గుడ్‌న్యూస్!
TG: రేపటి నుంచి రైతు భరోసా అమలుకు సిద్ధమవుతున్న ప్రభుత్వం కొత్తగా పాస్‌బుక్‌లు పొందినవారికి గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 1వ తేదీ వరకు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వారి కోసం రైతుభరోసా సైట్‌లో ప్రత్యేక ఆప్షన్ ఇచ్చారు. వారంతా తమ పాస్‌బుక్, ఆధార్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏఈవోలకు ఇస్తే వాటిని అప్‌లోడ్ చేసేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో రైతుబంధు రాని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకోవచ్చు.
News January 25, 2025
టెట్ ఫలితాలు ఎప్పుడంటే?
TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) ఫలితాలను ఫిబ్రవరి 5న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ తెలిపింది. నిన్న టెట్ ప్రిలిమినరీ ‘కీ’తో పాటు రెస్పాన్స్ షీట్లను రిలీజ్ చేసింది. ఇవాళ్టి నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని పేర్కొంది. కాగా ఈనెల 2 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరిగాయి. ఫలితాల విడుదల తర్వాత ఏప్రిల్‌లో సుమారు 5వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.