News April 15, 2025
ఈ నెలాఖరుకు 15వేల తొట్టెల నిర్మాణం: పంచాయతీరాజ్ శాఖ

AP: వేసవిలో మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు 15వేల తొట్టెలను నిర్మించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ వెల్లడించింది. ఉపాధి హామీ పథకం కింద రూ.60 కోట్ల వ్యయంతో ఈ నెలాఖరుకు నిర్మాణాలను పూర్తి చేస్తామని తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్న ఉపాధి హామీ కార్మికులకు, క్షేత్ర స్థాయి సిబ్బందిని పవన్ అభినందించారు.
Similar News
News April 23, 2025
సత్యసాయి శత జయంతికి రూ.100 నాణెం

శ్రీసత్యసాయిబాబా శతజయంతి ఉత్సవాలు వచ్చే ఏడాది నవంబర్ 23 నాటికి పూర్తవుతాయి. ఈ నేపథ్యంలో రూ.100 నాణేన్ని విడుదల చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. 44mm చుట్టుకొలత, 35 గ్రాముల బరువు ఉండే ఈ నాణెంలో 50% వెండి, 40% రాగి, 5% నికెల్, 5% జింక్ ఉంటుంది. ఒకవైపు అశోక స్తంభం, మరోవైపు సత్యసాయిబాబా చిత్రం, 1926 నంబర్ ఉంటుంది.
News April 23, 2025
దూబే మంచి మనసు.. 10 మందికి ఆర్థిక సాయం

టీమ్ ఇండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే మంచి మనసు చాటుకున్నారు. తమిళనాడులోని ప్రతిభావంతులైన అథ్లెట్లను ప్రోత్సహించేందుకు ముందుకొచ్చారు. రూ.70వేల చొప్పున పది మందికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటించారు. క్రీడల్లో రాణించాలంటే అధునాతన కిట్స్, నాణ్యమైన కోచింగ్ అవసరమని, అందుకే తన వంతు సాయం చేస్తున్నానని ఆయన తెలిపారు. TT, ఆర్చరీ, పారా అథ్లెటిక్స్, చెస్, క్రికెట్ తదితర రంగాల్లోని క్రీడాకారులకు ఈ డబ్బు అందనుంది.
News April 23, 2025
డీఈఈ సెట్ దరఖాస్తులు ప్రారంభం

AP: రెండేళ్ల డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు డీఈఈ సెట్ నోటిఫికేషన్ విడుదలైంది. మే 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 20న హాల్‌టికెట్లు విడుదలవుతాయి. జూన్ 2, 3వ తేదీల్లో పరీక్ష నిర్వహించి అదే నెల 10న అధికారులు ఫలితాలను ప్రకటిస్తారు.
వెబ్‌సైట్: <