News May 12, 2024
శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 16 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 76,945 మంది భక్తులు దర్శించుకోగా.. 33,844 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.67 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
Similar News
News December 5, 2025
తిరుమల దర్శనం టికెట్లు.. భక్తులకు గమనిక

తిరుమల వైకుంఠ ద్వార దర్శనాలు జరిగే 10రోజులు SSD(తిరుపతిలో ఇస్తున్న టైం స్లాట్) టోకెన్లు జారీ చేయరు. తొలి 3రోజులు ఆన్లైన్ టోకెన్లు ఉన్నవారినే అనుమతిస్తారు. తర్వాత నుంచి వచ్చే వారంతా నేరుగా కొండకు వచ్చి వైకుంఠం క్యూకాంప్లెక్స్-2 నుంచి దర్శనానికి వెళ్లవచ్చు. జనవరి 2నుంచి 8వ తేదీ వరకు శ్రీవాణి టికెట్లను ఇవాళ ఉదయం 10గంటలకు రిలీజ్ చేయగా.. SED(రూ.300) టిక్కెట్లు ఇవాళ మధ్యాహ్నం 3గంటలకు విడుదల కానున్నాయి.
News December 5, 2025
హనుమాన్ చాలీసా భావం -29

చారో యుగ ప్రతాప తుమ్హారా|
హై పరసిద్ధ జగత ఉజియారా||
ఓ హనుమా! మీ శక్తి, కీర్తి 4 యుగాలలో ప్రసిద్ధి చెందింది. ఈ సత్యం లోకమంతా విధితమే. మీ ఉనికి ఈ జగత్తు మొత్తానికి కాంతిలా వెలుగునిస్తుంది. మీరు ఈ ప్రపంచంలోని చీకటిని పోగొట్టి, జ్ఞానం, ధైర్యం, ఆనందాన్ని ఇస్తూ, సర్వత్రా వెలుగు పంచుతున్నారు. యుగాలు మారినా, మీ మహిమ మాత్రం ఎప్పటికీ చెక్కుచెదరక, ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తూనే ఉంది. <<-se>>#HANUMANCHALISA<<>>
News December 5, 2025
సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CSIR-CEERI) ప్రాజెక్ట్ స్టాఫ్ , JRF పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు ఈ నెల 14వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్/ఇనుస్ట్రుమెంటేషన్/ఫిజిక్స్లో B.Tech/BE/M.Tech/ME/MSc, BSc లేదా డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. షార్ట్ లిస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: www.ceeri.res.in/


