News November 26, 2024
ముంబై 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు

దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CSMT, ట్రైడెంట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో పాటు కాల్పులకు తెగబడ్డారు. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది దుండగులు చనిపోగా, ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని 2012 నవంబర్ 21న ఉరితీశారు.
Similar News
News November 23, 2025
ఆయిల్ ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

అసోంలోని దులియాజన్ ఆయిల్ ఇండియా లిమిటెడ్ 3 ఇంజినీర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 27న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 24 నుంచి 40ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్సైట్: https://www.oil-india.com/
News November 23, 2025
మిరియాలతో ఎన్నో ప్రయోజనాలు

మిరియాలు ప్రతి వంటింట్లో కచ్చితంగా ఉంటాయి. వీటివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంటున్నారు నిపుణులు. వీటిలో మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, సి, కె విటమిన్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి బరువును తగ్గించడం, క్యాన్సర్ నివారణ, డయాబెటీస్ కంట్రోల్లో ఉంచడం, గుండె ఆరోగ్యం, జీర్ణ వ్యవస్థ పనితీరును పెంచడంలో కీలకపాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. అయితే కడుపులో మంట ఉన్నవారు వీటిని మితంగా తీసుకోవాలి.
News November 23, 2025
28న 25 బ్యాంకులకు శంకుస్థాపన

AP: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఈ నెల 28న రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అక్కడ ఒకేసారి 25 బ్యాంకు భవన నిర్మాణ పనులకు భూమిపూజ చేయనున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అక్కడ ఏర్పాటు కానున్నాయి. ఇప్పటికే CRDA బ్యాంకులకు అవసరమైన భూములను కేటాయించింది. బ్యాంకుల ఏర్పాటుతో రాజధానిలో ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.


