News November 26, 2024
ముంబై 26/11 మారణ హోమానికి 16 ఏళ్లు
దేశ ఆర్థిక రాజధానిలో మారణ హోమానికి 16 ఏళ్లు. 2008 నవంబర్ 26న సముద్రమార్గం ద్వారా ముంబైలోకి ప్రవేశించిన 10 మంది ఉగ్రవాదులు తాజ్ హోటల్, CSMT, ట్రైడెంట్ ప్రాంతాల్లో బాంబు పేలుళ్లతో పాటు కాల్పులకు తెగబడ్డారు. 170 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, 300 మంది గాయపడ్డారు. భద్రతా బలగాల కాల్పుల్లో 9 మంది దుండగులు చనిపోగా, ఉగ్రవాది కసబ్ సజీవంగా పట్టుబడ్డాడు. అతడిని 2012 నవంబర్ 21న ఉరితీశారు.
Similar News
News December 8, 2024
ఈ ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు: VSR
AP: విశాఖలో దొరికిన కంటైనర్‌లో డ్రగ్స్ లేవని <<14811211>>సీబీఐ <<>>నిర్ధారించడంపై వైసీపీ ఎంపీ విజయసాయి స్పందించారు. ‘చంద్రబాబు కుట్ర రాజకీయాల్లో భాగంగా విశాఖ కంటైనర్‌లో డ్రగ్స్ దొరికిందని పోలింగ్‌కు నెలన్నర ముందు ఓటర్లను మోసం చేశాడు. బ్రెజిల్ అధ్యక్షుడికి, నాకు లింక్ పెట్టి మరీ అప్పుడు దుష్ప్రచారం చేశారు. ఇప్పుడు నాపై చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పు చంద్రబాబు’ అని VSR డిమాండ్ చేశారు.
News December 8, 2024
కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పు
AP: ఈ నెల 10, 11 తేదీల్లో జరగాల్సిన కలెక్టర్ల సదస్సు తేదీల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నెల 11, 12 తేదీల్లో జరుగుతుందని మంత్రులు, అధికారులకు ప్రభుత్వం నుంచి సమాచారం అందింది. అమరావతిలోని సచివాలయంలో 11న ఉదయం 11.గంటలకు సదస్సు ప్రారంభం అవుతుందని తెలిపింది. 12న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గస్థాయి విజన్ డాక్యుమెంట్లను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు.
News December 8, 2024
సోనియా గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు
NDA ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు జరుగుతున్నాయంటూ అమెరికన్ సంస్థలు, జార్జ్ సోరోస్, రాహుల్ గాంధీపై ఆరోపణలు చేస్తున్న BJP తాజాగా సోనియా గాంధీని టార్గెట్ చేసింది. కశ్మీర్‌ను స్వతంత్ర దేశంగా భావించే FDL-AP ఫౌండేషన్‌కు జార్జ్ సోరోస్ నుంచి నిధులు అందాయని, దీనికి సోనియా కో-ప్రెసిడెంట్ అని ఆరోపించింది. ఇది దేశ అంతర్గత వ్యవహారాల్లో విదేశీ హస్తం ఉందనడానికి రుజువని పేర్కొంది.