News November 15, 2024

16,347 ఉద్యోగాలు.. నిరుద్యోగులకు శుభవార్త

image

AP: 16,347 టీచర్ ఉద్యోగాల భర్తీ కోసం త్వరలో DSC నోటిఫికేషన్ విడుదల కానుంది. వెనుకబడిన వర్గాల వారికి <<14588103>>ఆన్‌లైన్‌లో <<>>ఉచిత DSC కోచింగ్ ఇస్తామని మంత్రి సవిత వెల్లడించారు. త్వరలోనే ప్రత్యేక వెబ్‌సైటు రూపొందించి, నిపుణులతో క్లాసులు నిర్వహించి, క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు అందుబాటులో ఉంచుతామన్నారు. బీఈడీ అర్హతతో పాటు టెట్‌లో అర్హత సాధించిన వారు ఉచిత ఆన్‌లైన్ కోచింగ్‌కు అర్హులని మంత్రి తెలిపారు.

Similar News

News December 14, 2024

గబ్బా టెస్టులో సారా టెండూల్కర్ సందడి

image

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న గబ్బా టెస్టులో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ సందడి చేశారు. స్టాండ్స్‌లో నుంచి భారత ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ ఆమె కనిపించారు. ఇందుకు సంబంధించిన పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. కాగా అమెరికాలో జరిగిన టీ20 వరల్డ్ కప్‌లో కూడా సారా సందడి చేసిన విషయం తెలిసిందే. భారత్ మ్యాచులు ఎక్కడుంటే అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.

News December 14, 2024

అల్లు అర్జున్ ఇంటికి రానున్న ప్రభాస్!

image

జైలు నుంచి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్‌ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.

News December 14, 2024

హైబ్రిడ్ మోడల్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ?

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హైబ్రిడ్ మోడల్‌లోనే జరుగుతుందని తెలుస్తోంది. దీనిపై ఇవాళ పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ స్వయంగా ప్రకటన చేస్తారని సమాచారం. అలాగే భారత్ ఆడే మ్యాచులన్నీ దుబాయ్ వేదికగా జరుగుతాయని తెలుస్తోంది. ఇకపై చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచులన్నీ తటస్థ వేదికల్లో జరుగుతాయి. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే వుమెన్స్ వరల్డ్ కప్‌లో కూడా దాయాదులు హైబ్రిడ్ పద్ధతిలోనే ఆడే అవకాశం ఉంది.