News December 6, 2024

16,347 టీచర్ పోస్టులు.. BIG UPDATE

image

AP: 16,347 టీచర్‌ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కన్పిస్తోంది. SC వర్గీకరణపై RR మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే <<14721880>>DSC<<>> ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.

Similar News

News March 20, 2026

ఇరాన్‌తో యుద్ధం కోసం ₹18 లక్షల కోట్లు!

image

ఇరాన్‌తో యుద్ధం కొనసాగించేందుకు $200 బిలియన్లు(₹18 లక్షల కోట్లు) కావాలని US కాంగ్రెస్‌ను పెంటగాన్ కోరినట్లు తెలుస్తోంది. ఇది ఇరాన్ ఎకానమీ($356B)లో సగం కంటే ఎక్కువ కావడం గమనార్హం. యుద్ధం మొదలైన తొలి వారంలోనే US $11B పైగా ఖర్చు చేసింది. ‘$200B అంటే చిన్న మొత్తమే. US ఎకానమీని దెబ్బతీస్తున్న ఇజ్రాయెల్ PM నెతన్యాహుకు అమెరికన్లు థాంక్స్ చెప్పాలి’ అని ఇరాన్ విదేశాంగ మంత్రి అరాఘ్చీ ఎద్దేవా చేశారు.

News March 20, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 20, 2026

BREAKING: పదో తరగతి ఇంగ్లిష్ పరీక్ష వాయిదా

image

AP: పదో తరగతి ఇంగ్లిష్ (థర్డ్ లాంగ్వేజ్) పరీక్షను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. రంజాన్ పండుగ నేపథ్యంలో ఈ నెల 21న పబ్లిక్ హాలిడే వచ్చింది. దీంతో ఆ రోజు జరగాల్సిన పరీక్షను ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9.30 నుంచి 12.45 వరకు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈవోలకు ఆదేశాలిచ్చింది. మరోవైపు ఇంటర్ ఫస్టియర్ IPE పరీక్ష ఈ నెల 21 నుంచి 25వ తేదీకి వాయిదా పడింది.