News December 6, 2024
16,347 టీచర్ పోస్టులు.. BIG UPDATE
AP: 16,347 టీచర్ పోస్టులతో మెగా DSC నోటిఫికేషన్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కన్పిస్తోంది. SC వర్గీకరణపై RR మిశ్రా నేతృత్వంలో నియమించిన ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతే <<14721880>>DSC<<>> ప్రక్రియ ప్రారంభిస్తామని విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ తెలిపారు. ఈ నివేదిక ఎప్పటికి వస్తుందో తనకు తెలియదని, ఆ అంశం తన పరిధిలో లేదని చెప్పారు. కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 60 రోజుల్లో నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది.
Similar News
News January 20, 2025
మహా కుంభమేళాలో అగ్నిప్రమాదం.. యోగికి మోదీ ఫోన్
మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ ఆరా తీశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు సంఘటనా స్థలాన్ని యోగి పరిశీలించారు. పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అగ్నిమాపక అధికారులు ఆయనకు తెలియజేశారు. కాగా సిలిండర్ పేలుడు వల్లే మంటలు చెలరేగినట్లు గుర్తించారు.
News January 20, 2025
పని నాణ్యతే ముఖ్యం: భారత్ పే సీఈఓ
వారంలో 90 గంటలు పనిచేయడమనేది చాలా కష్టమని భారత్ పే CEO నలిన్ నెగీ తెలిపారు. వర్క్ అవర్స్ కంటే ఎంత నాణ్యతతో పని చేశామనేదే ముఖ్యమన్నారు. ఉద్యోగి ఒత్తిడితో కాకుండా సంతోషంగా పనిచేస్తేనే సంస్థకు లాభమని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా ఉద్యోగులు వారానికి 90 గంటలు పనిచేయాలన్న ఎల్ అండ్ టీ ఛైర్మన్ SN సుబ్రహ్మణ్యన్ కామెంట్స్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.
News January 20, 2025
DANGER: రోజూ ఒకే సమయానికి నిద్ర పోవట్లేదా?
చాలామంది ఉద్యోగులు షిఫ్టుల వల్ల నిత్యం ఒకే సమయానికి నిద్రపోరు. దీన్నే ‘సోషల్ జెట్‌లాగ్’ అంటారు. ఒక వారంలో నిద్రపోయే సమయాల్లో 90 నిమిషాలు తేడా వస్తే శరీరంలో మైక్రోబయోటా జాతులు ఉత్పత్తి అవుతాయని సైంటిస్టులు గుర్తించారు. అలాంటివారికి ఎక్కువగా చిప్స్, షుగరీ ఫుడ్స్ తినాలనిపిస్తుందని తెలిపారు. ఫలితంగా సరైన ఆహారం తీసుకోలేకపోవడం, ఊబకాయం, కడుపులో మంట, స్ట్రోక్ ముప్పు తలెత్తవచ్చని సైంటిస్టులు తేల్చారు.