News May 20, 2024

ఖరీఫ్ కోసం 17.50 లక్షల టన్నుల ఎరువులు

image

AP: ఖరీఫ్‌లో ఎరువుల సరఫరాకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ సీజన్‌లో సగటు సాగు విస్తీర్ణం 81.25 లక్షల ఎకరాలు కాగా 17.50 లక్షల టన్నుల ఎరువులు అవసరమని అంచనా. ఇందులో 5.60 లక్షల టన్నులను ఆర్బీకేల ద్వారా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎక్కడా కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి ఆర్బీకేలో కనీసం 20 టన్నులు అందుబాటులో ఉంచాలని స్పష్టం చేసింది.

Similar News

News December 2, 2024

భారీ జీతంతో 334 ఉద్యోగాలు

image

NLC ఇండియా లిమిటెడ్‌లో 334 పోస్టులకు ఈ నెల 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్, జనరల్ మేనేజర్, అడిషనల్ చీఫ్ ఇంజినీర్ పోస్టులున్నాయి. మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ పూర్తిచేసిన వారు అర్హులు. పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పే స్కేల్ రూ.50,000-2,80,000 మధ్య ఉంటుంది. పూర్తి వివరాల కోసం <>ఇక్కడ క్లిక్<<>> చేయండి
సైట్: https://www.nlcindia.in/

News December 2, 2024

గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు: హెడ్ ప్రశంసలు

image

AUS స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ IND స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించారు. BGT తొలి టెస్టులో 89 పరుగులు చేసిన హెడ్‌ను బుమ్రా ఔట్ చేయగా అప్పటి నుంచి దీనిపై ఆయన స్పందించలేదు. తాజాగా రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు హెడ్ స్పందిస్తూ.. ‘నేను ఆడిన గొప్ప బౌలర్లలో బుమ్రా ఒకరు. అతని బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని నా మనవళ్లతో చెప్పడం కూడా బాగుంటుంది’ అని ఆయన ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు.

News December 2, 2024

పదవులపై ఆశ లేదు: శిండే కుమారుడు

image

తాను డిప్యూటీ సీఎం అవుతాననే ప్రచారంపై మహారాష్ట్ర ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే కుమారుడు శ్రీకాంత్ శిండే స్పందించారు. ఆ రేసులో లేనని, తనకు పదవులపై ఎలాంటి ఆశ లేదని స్పష్టం చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల తర్వాత నాకు కేంద్రమంత్రి పదవి ఆఫర్ వచ్చినా తీసుకోలేదు. పార్టీ కోసం పనిచేయడానికే కట్టుబడి ఉన్నా’ అని శ్రీకాంత్ వెల్లడించారు.