News November 13, 2024

CSK ఓపెనర్‌గా 17 ఏళ్ల టీనేజర్?

image

ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను వేలంలో దక్కించుకుని ఓపెనర్‌గా ఆడించాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్ చూసి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంప్రెస్ అయ్యారని, ట్రయల్స్‌కు కూడా పిలిపించారని సమాచారం. ఇందుకు MCAను CSK అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆయుష్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. 17 ఏళ్ల ఆయుష్ 5 మ్యాచుల్లోనే 321 పరుగులు బాదారు.

Similar News

News November 18, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*ఈ నెల 25న మరోసారి రాష్ట్ర క్యాబినెట్ భేటీ. 50% రిజర్వేషన్‌పై నివేదిక ఇవ్వాలని డెడికేషన్ కమిషన్‌కు క్యాబినెట్ సిఫార్సు.
* రైతులు, మిల్లర్ల సమస్యలపై చర్చించేందుకు రాష్ట్రానికి రావాలని సీసీఐకి మంత్రి తుమ్మల విజ్ఞప్తి.
* అసదుద్దీన్ ఒవైసీ మాతో కలిసి ఉన్నా లేకపోయినా చేతి గుర్తుకు మద్దతు ఇచ్చారు. ప్రభుత్వంతో కలిసి ఉన్నామని చెప్పకనే చెప్పారు. పరిస్థితులను బట్టి రాజకీయాలు మారుతాయి: PCC చీఫ్ మహేశ్ కుమార్

బిహార్ కొత్త ఎమ్మెల్యేల్లో 40% మందికి డిగ్రీల్లేవ్

image

బిహార్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల్లో దాదాపు 40 శాతం మందికి డిగ్రీ కూడా లేదు. 32 శాతం మంది మాత్రమే గ్రాడ్యుయేట్లు ఉన్నారు. పీజీ చేసిన వాళ్లు 28 శాతం ఉన్నారు. 192 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరిగి పోటీ చేయగా 111 మంది మళ్లీ గెలిచారు. ఇక 12 శాతం మంది మహిళలు (29) ఎన్నికయ్యారు. గతేడాదితో పోలిస్తే (26) కాస్త ఎక్కువ. ఈ విషయాలను PRS Legislative Research సంస్థ తాజాగా వెల్లడించింది.