News November 13, 2024

CSK ఓపెనర్‌గా 17 ఏళ్ల టీనేజర్?

image

ముంబై క్రికెటర్ ఆయుష్ మాత్రేను వేలంలో దక్కించుకుని ఓపెనర్‌గా ఆడించాలని CSK భావిస్తున్నట్లు తెలుస్తోంది. అతడి బ్యాటింగ్ చూసి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఇంప్రెస్ అయ్యారని, ట్రయల్స్‌కు కూడా పిలిపించారని సమాచారం. ఇందుకు MCAను CSK అనుమతి కోరినట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆయుష్ ఇన్నింగ్స్ ఓపెన్ చేస్తారని టాక్. 17 ఏళ్ల ఆయుష్ 5 మ్యాచుల్లోనే 321 పరుగులు బాదారు.

Similar News

News December 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News December 10, 2024

మోహన్‌బాబు రాసిన లేఖలో ఇంకేముందంటే?

image

TG: తాను HYD జల్‌పల్లిలో పదేళ్లుగా ఉంటున్నానని, ఇల్లువదిలి వెళ్లిపోయిన <<14835430>>మనోజ్<<>> 4నెలల కిందట తిరిగొచ్చారని రాచకొండ CPకి రాసిన లేఖలో మోహన్‌బాబు చెప్పారు. ‘అతను తన భార్య, మరికొందరితో కలిసి నన్ను ఇంటి నుంచి పంపాలని చూశాడు. తన 7నెలల కుమార్తెను ఇంటి పనిమనిషి సంరక్షణలో విడిచిపెట్టాడు. మాదాపూర్‌లోని నా ఆఫీసు సిబ్బందిని 30మందితో బెదిరించాడు. నేను 78ఏళ్ల సీనియర్ సిటిజన్‌ని. రక్షణ కల్పించండి’ అని రాశారు.

News December 10, 2024

డిసెంబర్ 10: చరిత్రలో ఈ రోజు

image

1878: స్వాతంత్ర్య సమరయోధుడు, భారత గవర్నర్ సి.రాజగోపాలచారి(ఫొటోలో) జననం
1896: డైనమైట్ సృష్టికర్త ఆల్ఫ్రెడ్ నోబెల్ మరణం
1952: సినీ నటి సుజాత జననం
1955: నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగిన రోజు
1985: సినీ నటి కామ్నా జఠ్మలానీ జననం
* అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం