News August 25, 2024

హైదరాబాద్ పేలుళ్లకు 17 ఏళ్లు

image

ఆగస్టు 25 2007. హైదరాబాద్ ఉలిక్కిపడిన రోజు. సాయంత్రం సరదాగా గడిపేందుకు వచ్చిన అమాయకులు బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. సా.7.30 గం.కు లుంబినీ పార్కులో లేజర్ షో చూస్తుండగా బాంబు పేలి 9 మంది చనిపోయారు. 10 ని. గ్యాప్‌లో గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలి 33 మంది చనిపోయారు. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరికి మరణశిక్ష పడింది. గతేడాది మరో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష విధించారు.

Similar News

News April 6, 2026

త్వరలోనే తులం బంగారం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: ఎన్నికల్లో తామిచ్చిన హామీలను ఐదేళ్ల పదవీ కాలం ముగిసే లోపు వంద శాతం అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆ తర్వాతే ప్రజలను ఓట్లు అడుగుతామన్నారు. ఇప్పటికే మెజార్టీ హామీలను నెరవేర్చామని తెలిపారు. అర్హులైన వధువులకు తులం బంగారం పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటించారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావాలనే 420 హామీలంటూ ప్రజలను పక్కదారి పట్టించేలా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

News April 6, 2026

సీజ్‌ఫైర్‌ను తిరస్కరించిన ఇరాన్.. ట్రంప్ వార్నింగ్!

image

సీజ్‌ఫైర్‌పై పాకిస్థాన్ ద్వారా US పంపిన ప్రతిపాదనలను ఇరాన్ తిరస్కరించింది. అందుకు ప్రతిగా 10 కండిషన్లు పెట్టింది. ఒక్క సీజ్‌ఫైర్‌తో సరిపెట్టుకునేది లేదని స్పష్టం చేసింది. హార్ముజ్‌పై తమ కంట్రోల్‌కు గుర్తింపు, ఆంక్షలు ఎత్తివేత, నష్టపరిహారం మొదలైనవి డిమాండ్లుగా పేర్కొంది. దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఇరాన్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

News April 6, 2026

3 మ్యాచుల్లో వివాదాలు.. బీసీసీఐకి SRH ఫిర్యాదు?

image

RCB, KKR, LSGతో మ్యాచుల సందర్భంగా జరిగిన పరిణామాలపై SRH బీసీసీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. క్లాసెన్ క్యాచ్‌ను సాల్ట్, అభిషేక్ క్యాచ్‌ను వరుణ్ బంతి నేలను తాకాక పట్టుకొన్నట్లు కనిపిస్తున్నా ఔటివ్వడంపై యాజమాన్యం అసంతృప్తిగా ఉంది. అలాగే నిన్న పంత్ కొట్టిన బాల్ బౌండరీ లైన్ దాటకముందే అవేశ్ బ్యాటుతో లోపలికి కొట్టారు. వీటిపై చర్యలు తీసుకోవాలని సన్ రైజర్స్ కోరనున్నట్లు <<19577513>>తెలుస్తోంది.<<>>