News August 25, 2024

హైదరాబాద్ పేలుళ్లకు 17 ఏళ్లు

image

ఆగస్టు 25 2007. హైదరాబాద్ ఉలిక్కిపడిన రోజు. సాయంత్రం సరదాగా గడిపేందుకు వచ్చిన అమాయకులు బాంబు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయారు. సా.7.30 గం.కు లుంబినీ పార్కులో లేజర్ షో చూస్తుండగా బాంబు పేలి 9 మంది చనిపోయారు. 10 ని. గ్యాప్‌లో గోకుల్ చాట్ వద్ద మరో బాంబు పేలి 33 మంది చనిపోయారు. ఇండియన్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థకు చెందిన ఇద్దరికి మరణశిక్ష పడింది. గతేడాది మరో నలుగురికి పదేళ్ల జైలుశిక్ష విధించారు.

Similar News

News September 16, 2024

సీఎం రేవంత్ నన్ను చంపాలని చూస్తున్నారు: ఎమ్మెల్యే కౌశిక్

image

TG: తాము అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ‘సీఎం రేవంత్ నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలి. హామీల అమలు గురించి అడిగితే దాడి చేయిస్తున్నారు. దాడి చేయించానని స్వయంగా ఆయనే చెప్పారు. రేవంత్‌కు నేను భయపడను. చావడానికైనా సిద్ధం. దాడులపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తా’ అని ప్రెస్ మీట్‌లో వ్యాఖ్యానించారు.

News September 16, 2024

కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్య

image

AP: నామినేటెడ్ పదవుల భర్తీని NDA కూటమి ప్రారంభించింది. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి.కృష్ణయ్యను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రిటైర్డ్ IAS అయిన కృష్ణయ్య మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో APIIC ఛైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తించారు.

News September 16, 2024

హీరో దర్శన్ అంతకుముందు ఉన్న జైలులో ఫోన్లు, కత్తులు

image

హత్య కేసులో అరెస్టయిన సినీ హీరో దర్శన్‌కు VIP ట్రీట్‌మెంట్ ఇచ్చిన బెంగళూరు జైలులో పోలీసులు తాజాగా రైడ్ చేశారు. 15 ఫోన్లు, ₹1.3లక్షల విలువైన శామ్‌సంగ్ డివైస్, 7 ఎలక్ట్రిక్ స్టవ్‌లు, 5 కత్తులు, 3 ఫోన్ ఛార్జర్లు, పెన్ డ్రైవ్‌లు, ₹36,000 నగదు, సిగరెట్, బీడీ ప్యాకెట్లు, అగ్గిపెట్టెలు స్వాధీనం చేసుకున్నారు. VIP ట్రీట్‌మెంట్ విషయం వివాదంగా మారడంతో దర్శన్‌ను బళ్లారి జిల్లా జైలుకు మార్చిన సంగతి తెలిసిందే.