News June 11, 2024
2030 కల్లా 18-20 శాతం మార్కెట్ షేర్ లక్ష్యం: టాటా మోటార్స్

దేశీయ మార్కెట్లో 2030 కల్లా 18-20% వాటాను దక్కించుకోవాలని టాటా మోటార్స్ ఆకాంక్షిస్తోంది. 2023-24 FYలో 14 శాతం మార్కెట్ వాటాతో దేశంలో మూడో అతిపెద్ద ప్రయాణికుల వాహనాల అమ్మకందారుగా టాటా మోటార్స్ నిలిచింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నూతన మోడళ్లను తీసుకురావడం, వ్యూహాత్మక వాణిజ్య ప్రణాళికలు, EV మార్కెట్ విస్తరణ ద్వారా తన లక్ష్యాలను చేరుకోవాలని సంస్థ భావిస్తోంది.
Similar News
News January 7, 2026
ఒప్పో సబ్ బ్రాండ్లుగా రియల్మీ, వన్ ప్లస్.. కారణమిదే!

చైనా మొబైల్ కంపెనీలు రియల్మీ, వన్ ప్లస్ ఇకపై ఒప్పో సబ్ బ్రాండ్లుగా మారనున్నాయి. ఒప్పో సారథ్యంలోనే ఇవి పని చేయనున్నాయి. నిజానికి ఒప్పో, వివో, వన్ ప్లస్, రియల్మీ కంపెనీలు BBK ఎలక్ట్రానిక్స్కు చెందినవి. తాజా నిర్ణయంతో వేర్వేరుగా రీసెర్చ్&డెవలప్మెంట్, సేల్స్, లాజిస్టిక్ టీమ్స్ అవసరం ఉండదు. వనరులను సమీకరించుకుని, ఖర్చులను తగ్గించుకుని మార్కెట్లో మరింత వృద్ధి చెందాలని ఇవి లక్ష్యంగా పెట్టుకున్నాయి.
News January 7, 2026
నెల్లూరులో టాటా పవర్ అతిపెద్ద ప్లాంట్.. ₹6,675 కోట్ల పెట్టుబడులు!

AP: నెల్లూరులో టాటా సంస్థ భారీగా పెట్టుబడులు పెట్టనుంది. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ(TPREL) ₹6,675 కోట్లతో 10GW సామర్థ్యంతో ఇంగాట్, వేఫర్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఇది దేశంలోనే అతిపెద్ద ఇంగాట్, వేఫర్ తయారీ సెంటర్గా నిలవనుంది. సెమీకండక్టర్ చిప్స్, సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఉత్పత్తిలో ఈ మెటీరియల్స్ చాలా కీలకం. ఈ సంస్థ రాకతో ప్రత్యక్షంగా 1000 మందికి ఉద్యోగ అవకాశాలు దక్కనున్నాయి.
News January 7, 2026
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.


