News June 11, 2024
2030 కల్లా 18-20 శాతం మార్కెట్ షేర్ లక్ష్యం: టాటా మోటార్స్

దేశీయ మార్కెట్‌లో 2030 కల్లా 18-20% వాటాను దక్కించుకోవాలని టాటా మోటార్స్ ఆకాంక్షిస్తోంది. 2023-24 FYలో 14 శాతం మార్కెట్ వాటాతో దేశంలో మూడో అతిపెద్ద ప్రయాణికుల వాహనాల అమ్మకందారుగా టాటా మోటార్స్ నిలిచింది. మారుతీ సుజుకీ, హ్యుందాయ్ తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. నూతన మోడళ్లను తీసుకురావడం, వ్యూహాత్మక వాణిజ్య ప్రణాళికలు, EV మార్కెట్ విస్తరణ ద్వారా తన లక్ష్యాలను చేరుకోవాలని సంస్థ భావిస్తోంది.
Similar News
News March 24, 2025
కేటీఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్

TG: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన 6 హామీల్లో 5 అమలు చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మళ్లీ అధికారంలోకి రాకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తాను చేసిన ఈ సవాల్‌కు కేటీఆర్ సిద్ధమేనా అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లక తప్పదని జోస్యం చెప్పారు.
News March 24, 2025
అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట

ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతికి హైకోర్టులో భారీ ఊరట దక్కింది. ఆయనను తెలంగాణలోనే కొనసాగేలా ఉత్తర్వులివ్వాలని డీవోపీటీని న్యాయస్థానం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్ చేయాలంటూ ఇటీవల మహంతికి డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించారు. అయితే స్టే విధించేందుకు క్యాట్ నిరాకరించడంతో మహంతి హైకోర్టు మెట్లెక్కారు.
News March 24, 2025
ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలి: జగన్

AP: రైతుల విషయంలో ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించాలని, తమ ప్రభుత్వంలో పంటల బీమా రైతులకు హక్కుగా ఉండేదని మాజీ CM జగన్ అన్నారు. నష్టపోయిన అరటి రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని చెప్పారు. కడప (D) లింగాలలో అరటి రైతులను <<15868939>>పరామర్శించిన<<>> ఆయన మాట్లాడుతూ.. ‘రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ సొమ్ము ఇవ్వాలి. సాయం అందని వారిని మరో మూడేళ్లలో మేం అధికారంలోకి వచ్చి ఆదుకుంటాం’ అని తెలిపారు.