News November 1, 2024
శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. టీబీసీ కౌంటర్ వరకు భక్తులు క్యూలైన్‌లో ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63987 మంది దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.2.66 కోట్లు లభించింది.
Similar News
News December 10, 2024
వంగవీటి రాధకు ఎమ్మెల్సీ పదవి?
AP: సీఎం చంద్రబాబు ఆఫీసుకు వంగవీటి రాధ కాసేపట్లో వెళ్లనున్నారు. రాధకు ఎమ్మెల్సీ పదవిని ఆఫర్ చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వారి మధ్య భేటీలో ఏయే అంశాలు చర్చకు వస్తాయనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 10, 2024
టీమ్ ఇండియా ప్లేయర్ సుదర్శన్‌కు సర్జరీ
టీమ్ ఇండియా క్రికెటర్ సాయి సుదర్శన్‌కు సర్జరీ జరిగింది. ‘నాకు శస్త్రచికిత్స చేసిన వైద్యులకు, చేయించిన బీసీసీఐకి, అండగా నిలిచిన గుజరాత్ టైటాన్స్ ఫ్యామిలీకి కృతజ్ఞతలు’ అంటూ ఆయన ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్, నెటిజన్లు ఆయన త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. కాగా IPL మెగావేలానికి ముందే సుదర్శన్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.8.50 కోట్లకు రిటైన్ చేసుకుంది.
News December 10, 2024
ఉద్యోగులను తొలగించలేదు: YES MADAM
పనిలో ఒత్తిడికి లోనవుతున్నామని చెప్పిన ఉద్యోగులను <<14833339>>తొలగించడంపై<<>> ‘YES MADAM’ కంపెనీపై తీవ్ర విమర్శలొచ్చిన విషయం తెలిసిందే. పక్కా ప్రణాళికతోనే ఇలా చేశారంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో సదరు కంపెనీ స్పందిస్తూ ఎవరినీ తొలగించలేదని స్పష్టం చేసింది. అయితే, ఉన్నట్టుండి ఉద్యోగాలు కోల్పోయిన వంద మందికి ఉద్యోగాలిచ్చేందుకు సిద్ధమని ‘MAGICPIN’ అనే మరో కంపెనీ లింక్డ్‌ఇన్‌లో పోస్ట్ చేసింది.