News August 27, 2024
WBBLలోకి మరో 18 మంది భారత ప్లేయర్లు!

వుమెన్స్ బిగ్ బాష్ లీగ్-10 డ్రాఫ్ట్స్లో 18 మంది భారత మహిళా క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. స్మృతి మంధాన ఇప్పటికే అడిలైడ్ స్ట్రైకర్స్తో ఒప్పందం చేసుకున్నారు. స్మృతితోపాటు హర్మన్ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శ్రేయాంకా పాటిల్, టిటాస్, ఆషా, రాధా, అమన్జోత్, యాస్తికా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత, సజన, కశ్యప్, మేఘన, వేద, మోనా, మేఘ్న సింగ్ ఉన్నారు. వచ్చే నెల 1న వేలం జరగనుంది.
Similar News
News November 20, 2025
ఏపీకి మళ్లీ వర్ష సూచన

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడే అవకాశముందని.. తర్వాతి 48 గంటల్లో ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలి వాయుగుండంగా బలపడే ఛాన్సుందని వాతావరణశాఖ తెలిపింది. దీని ప్రభావంతో నేటి నుంచి ఆదివారం వరకు ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. మంగళవారం కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
News November 20, 2025
ఓటమి తర్వాత తేజస్వీ యాదవ్ ఫస్ట్ రియాక్షన్

కొత్త ప్రభుత్వం బిహార్ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తుందని ఆకాంక్షిస్తున్నట్లు RJD నేత తేజస్వీ యాదవ్ పేర్కొన్నారు. ఎన్నికల్లో తమ పార్టీ ఓటమి తర్వాత తొలిసారి ఆయన స్పందించారు. ‘సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ గారికి, కొత్తగా మంత్రులైన సభ్యులు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పడిన ఈ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుందని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.
News November 20, 2025
దేవ్జీ, రాజిరెడ్డి మా వద్ద లేరు.. HCకి తెలిపిన పోలీసులు

AP: టాప్ మావోలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మల్లా రాజిరెడ్డిని కోర్టులో హాజరుపర్చేలా ఆదేశించాలన్న పిటిషన్లపై పోలీసులు HCలో వివరణ ఇచ్చారు. వారిద్దరూ తమ వద్ద లేరన్నారు. దీంతో వారు పోలీసుల వద్ద ఉన్నారనేందుకు ఆధారాలు చూపాలని పిటిషనర్లను HC ఆదేశించింది. మావో కీలక నేతలు తమ అధీనంలో ఉన్నారన్న పోలీసుల ప్రెస్ స్టేట్మెంట్ను సమర్పిస్తామని పిటిషనర్లు చెప్పడంతో విచారణను HC రేపటికి వాయిదా వేసింది.


