News August 27, 2024

WBBLలోకి మరో 18 మంది భారత ప్లేయర్లు!

image

వుమెన్స్ బిగ్ బాష్ లీగ్‌-10 డ్రాఫ్ట్స్‌లో 18 మంది భారత మహిళా క్రికెటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారు. స్మృతి మంధాన ఇప్పటికే అడిలైడ్ స్ట్రైకర్స్‌తో ఒప్పందం చేసుకున్నారు. స్మృతితోపాటు హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, శ్రేయాంకా పాటిల్, టిటాస్, ఆషా, రాధా, అమన్‌జోత్, యాస్తికా, శిఖా పాండే, స్నేహ్ రాణా, హేమలత, సజన, కశ్యప్, మేఘన, వేద, మోనా, మేఘ్న సింగ్ ఉన్నారు. వచ్చే నెల 1న వేలం జరగనుంది.

Similar News

News September 14, 2024

నిర్మాణాలు పూర్తవకుండా కాలేజీలు ఎలా ప్రారంభిస్తాం: సత్యకుమార్

image

AP: ప్రభుత్వంపై జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి సత్యకుమార్ మండిపడ్డారు. ‘మెడికల్ కాలేజీల నిర్మాణం గత ఐదేళ్లలో పూర్తి చేయలేదు. వసతులు లేకుండా తరగతులు ఎలా ప్రారంభిస్తాం? వైద్య విద్య అందించాలంటే NMC ప్రమాణాలు పాటించాలి. నిర్మాణంలో ఉన్న 12 కాలేజీల్లో వచ్చే ఏడాది క్లాసులు ప్రారంభిస్తాం. జగన్ ఆరోగ్యశ్రీకి రూ.2500 కోట్ల బకాయిలు పెట్టి వెళ్లారు. మేం రాగానే రూ.652 కోట్లు చెల్లించాం’ అని వివరించారు.

News September 14, 2024

వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నాశనం: మంత్రి నాదెండ్ల

image

AP: వైసీసీ చీఫ్ జగన్ తన పాలనలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. క్షేత్రస్థాయిలో పర్యటించకుండా మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అధికార యంత్రాంగాన్ని సమన్వయపరిచినట్లు తెలిపారు. లీడర్ అంటే పవన్‌లా ఉండాలని, మీడియా ముందు కాగితాలు పట్టుకొని ఊగిపోవడం ఏంటన్నారు. నిజాయితీ ఉంటే ఆ పార్టీ యంత్రాంగం ప్రభుత్వ వరద సాయంలో భాగమవ్వాలన్నారు.

News September 14, 2024

ఎల్లుండి ఖైరతాబాద్ గణేశ్ దర్శనం లేదు

image

TG: ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ కీలక ప్రకటన చేసింది. సోమవారం మహాగణపతి దర్శనానికి అనుమతి లేదని చెప్పింది. శని, ఆదివారం మాత్రమే అనుమతి ఇస్తామని, భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించింది. మంగళవారం నిమజ్జనం ఉండటంతో సోమవారం వెల్డింగ్ తదితర పనుల నేపథ్యంలో భక్తులను అనుమతించబోమని పేర్కొంది. కాగా మంగళవారం మధ్యాహ్నానికి లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరనున్నాడు.