News February 16, 2025
18 మంది దుర్మరణం.. కారణమిదే: రైల్వే శాఖ

ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై రైల్వే శాఖ ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. ‘నిన్న ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ రావడంలో కొంత ఆలస్యమైంది. 14వ ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులు వేచి ఉన్నారు. ఇంతలో 12వ ప్లాట్‌ఫామ్‌పై ప్రత్యేక రైలును ప్రకటించారు. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా అక్కడికి కదలడంతో మెట్లపై తొక్కిసలాట జరిగి 18 మంది చనిపోయారు. ఈ ఘటన దురదృష్టకరం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని పేర్కొంది.
Similar News
News March 27, 2025
రుణమాఫీ వల్ల రైతులు అటూ ఇటూ కాకుండా పోయారు: నిర్మల

తెలంగాణలో సగం మంది రైతులకు రుణమాఫీ కాకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అయిందని చెప్పడంతో నష్టం జరుగుతోందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో తెలిపారు. ‘దీనివల్ల బ్యాంకులు అందరినీ పరిగణనలోకి తీసుకొని వన్‌టైం సెటిల్‌మెంట్ కింద రుణాలను రద్దు చేస్తుంది. ఆ తర్వాత కొత్తవి తీసుకోవడానికి రైతులకు అర్హత ఉండదు. దీంతో అన్నదాతలు అటూ ఇటూ కాకుండా పోయారు’ అని విచారం వ్యక్తం చేశారు.
News March 27, 2025
సోమవారం సెలవు

ఈసారి ‘ఉగాది’ పండుగ ఆదివారం(ఈనెల 30న) రావడంతో చాలామంది విద్యార్థులు, ఉద్యోగులు నిరాశకు గురవుతున్నారు. వారికి ఊరటనిచ్చే విషయం ఏమిటంటే సోమవారం కూడా సెలవు ఉండనుంది. ఎందుకంటే ఆరోజు రంజాన్. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు హాలిడే ఇవ్వనున్నారు. దీంతో ఆది, సోమవారాల్లో సెలవులను ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు?
News March 27, 2025
బ్యాంక్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్

బ్యాంక్ ఖాతాదారులు ఇకపై నలుగురు నామినీలను యాడ్ చేసుకునేలా కేంద్రం వెసులుబాటు కల్పించింది. ఈమేరకు నిన్న బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లుకు రాజ్యసభలో మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. గతేడాది డిసెంబర్‌లోనే దీనికి లోక్‌సభలో గ్రీన్‌సిగ్నల్ లభించింది. అటు ఓ వ్యక్తి బ్యాంకులో ఉంచుకునేందుకు అనుమతించే మొత్తం నగదును ఈ బిల్లు ద్వారా రూ.5లక్షల నుంచి రూ.2 కోట్లకు కేంద్రం పెంచింది.