News March 11, 2025

18 సీజన్లు.. ఒక్కడే కింగ్: RCB

image

విరాట్ కోహ్లీని 2008లో సరిగ్గా ఇదే రోజున IPL ఆక్షన్‌లో కొనుగోలు చేసినట్లు RCB ట్వీట్ చేసింది. ‘U19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్‌ను తీసుకున్నాం. 18yrs తర్వాత కూడా ఈ గేమ్‌కు అతడే కింగ్. ఇది చాలా గొప్ప ప్రయాణం. థాంక్యూ విరాట్. 18 సీజన్లు, 1 టీమ్, 1 కాన్‌స్టాంట్ కింగ్’ అని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని RCB ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.

Similar News

News November 14, 2025

APPLY NOW: నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 పోస్టులు

image

నార్త్ ఈస్టర్న్ రైల్వేలో 1104 అప్రెంటిస్‌ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ ఉత్తీర్ణులైన, 15 నుంచి 24 ఏళ్లు గలవారు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్‌లో సడలింపు ఉంది. ప్రాసెసింగ్ ఫీజు రూ.100. ST, SC, దివ్యాంగులకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://ner.indianrailways.gov.in/

News November 14, 2025

వణుకుతోన్న హైదరాబాద్.. సింగిల్ డిజిట్ నమోదు

image

చలికి హైదరాబాద్‌ మహానగరం గజగజ వణుకుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నేడు అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8°C నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10.7, BHELలో 11.1, బొల్లారం, మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్‌లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3-4 రోజులూ ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.

News November 14, 2025

జూబ్లీహిల్స్ కౌంటింగ్: షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో EVM ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షేక్‌పేట డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు 8,911, BRSకు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండగా.. 11న పోలింగ్ రోజు సాయంత్రం BRS-కాంగ్రెస్ ఇక్కడ దొంగ ఓట్లపై ఆరోపణలు చేసుకున్నాయి.