News March 11, 2025

18 సీజన్లు.. ఒక్కడే కింగ్: RCB

image

విరాట్ కోహ్లీని 2008లో సరిగ్గా ఇదే రోజున IPL ఆక్షన్‌లో కొనుగోలు చేసినట్లు RCB ట్వీట్ చేసింది. ‘U19 ప్లేయర్ డ్రాఫ్ట్ నుంచి ఈ టాలెంటెడ్ బాయ్‌ను తీసుకున్నాం. 18yrs తర్వాత కూడా ఈ గేమ్‌కు అతడే కింగ్. ఇది చాలా గొప్ప ప్రయాణం. థాంక్యూ విరాట్. 18 సీజన్లు, 1 టీమ్, 1 కాన్‌స్టాంట్ కింగ్’ అని ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని RCB ఈసారైనా ఛాంపియన్‌గా నిలుస్తుందేమో చూడాలి.

Similar News

News March 22, 2025

హమాస్ సైనిక నిఘా చీఫ్‌ను అంతం చేశాం: ఇజ్రాయెల్

image

హమాస్ సంస్థ సైనిక నిఘా చీఫ్‌గా ఉన్న ఒసామా టబాష్‌ను అంతం చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దక్షిణ గాజాలో తాము జరిపిన దాడుల్లో అతడు హతమైనట్లు పేర్కొంది. హమాస్ ఎవరిని లక్ష్యంగా చేసుకోవాలో నిర్దేశించే టార్గెటింగ్ యూనిట్‌కీ ఒసామా నేతృత్వం వహిస్తున్నాడని తెలిపింది. దీనిపై హమాస్ నుంచి స్పందనేమీ రాలేదు.

News March 22, 2025

స్కూళ్లకు ఇవాళ సెలవు ఇవ్వాలని వినతి

image

TG: రాష్ట్రంలో అకాల వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. నిన్న మధ్యాహ్నం నుంచి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వానలు పడుతున్నాయి. చాలా చోట్ల చెట్లు నేలకూలి రోడ్లపై పడ్డాయి. <<15840994>>ఇవాళ<<>> కూడా బలమైన గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో స్కూళ్లకు సెలవు ఇవ్వాలని పేరెంట్స్ కోరుతున్నారు. గాలివానలో పిల్లలను పాఠశాలలకు పంపడంపై ఆందోళన చెందుతున్నారు. దీనిపై మీరేమంటారు?

News March 22, 2025

బయట తినాలంటేనే భయమేస్తోంది

image

TG: ప్రముఖ రెస్టారెంట్లలో అపరిశుభ్ర వాతావరణం ఫుడ్ లవర్స్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గత కొన్ని రోజులుగా HYDలో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేస్తోన్న దాడుల్లో కుళ్లిన మాంసం లభించగా, కిచెన్ శుభ్రంగా లేదని, కూరగాయలు సరిగ్గా నిల్వ చేయట్లేదని సోదాల్లో తేల్చారు. దీంతో ఇలాంటి ఫుడ్ ఎలా తినాలని పలువురు కామెంట్లు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించినా నాణ్యమైన ఫుడ్ ఇవ్వకపోతే ఎలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.

error: Content is protected !!