News November 3, 2024

18 ఏళ్లు నిండినవారు అప్లై చేసుకోవాలి

image

TG: రాష్ట్రంలో కొత్తగా 4,78,838 మంది యువ ఓటర్లు నమోదయ్యారని CEO సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈసారి మొత్తం 8 లక్షల మంది కొత్త ఓటర్లు నమోదు కావడంతో ఓటర్ల సంఖ్య 3,34,26,323కు చేరినట్లు చెప్పారు. ఓటర్ల నమోదుకు ఈనెల 9,10న స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఉ.10 గంటల నుంచి సా.5.30 గంటల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంటారన్నారు. 18 ఏళ్లు నిండినవారు ఓటుకు అప్లై చేసుకోవాలన్నారు.

Similar News

News December 8, 2024

BREAKING: రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

image

AP: పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పిడుగురాళ్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద కొత్త కారుకు పూజ చేసుకుని తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

News December 8, 2024

మహాయుతి గెలుపుపై ప్రజల్లో అసంతృప్తి ఉంది: పవార్

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ‘మహాయుతి’ గెలుపుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని NCP(SP) చీఫ్ శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. ధైర్యాన్ని కోల్పోకూడదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. ‘మనం ఓడిన మాట నిజమే. దానిపై ఎక్కువ చింతించడం వల్ల ఉపయోగం లేదు. తిరిగి ప్రజల్లోకి వెళ్లాలి’ అని హితబోధ చేశారు. ఎంవీఏ కూటమిని సమాజ్‌వాదీ పార్టీ వీడటాన్ని పవార్ తోసిపుచ్చారు. ప్రతిపక్ష ఐక్యత కీలకమని అఖిలేశ్ భావిస్తున్నారని తెలిపారు.

News December 8, 2024

బోల్ట్ రికార్డ్ బద్దలుకొట్టిన గౌట్

image

పరుగు పందెం అనగానే మనందరికీ జమైకా చిరుత ఉసేన్ బోల్ట్ గుర్తొస్తాడు. ఒలింపిక్స్‌లో ఈ అథ్లెట్ నెలకొల్పిన రికార్డులు అలాంటివి మరి. తాజాగా, బోల్ట్ రికార్డును ఆస్ట్రేలియా స్ప్రింటర్ గౌట్ బద్దలుకొట్టారు. ఆస్ట్రేలియన్ స్కూల్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 200మీ. పరుగును 20.04 సె.లో పూర్తి చేశాడు. గతంలో ఈ రికార్డ్ బోల్ట్ పేరిట (20.13సె) ఉండేది. రానున్న ఒలింపిక్స్‌లో గౌట్ హాట్ ఫేవరెట్‌గా బరిలో దిగనున్నారు.