News August 16, 2024
RGకర్ ఆస్పత్రి విధ్వంసం కేసులో 19 మంది అరెస్టు
RGకర్ ఆస్పత్రి విధ్వంసం కేసులో 19 మందిని అరెస్టు చేశామని కోల్‌కతా పోలీసులు Xలో ప్రకటించారు. వీరిలో ఐదుగురిని సోషల్ మీడియా ఫీడ్‌బ్యాక్ ద్వారా గుర్తించామన్నారు. తాము ఇంతకు ముందు చేసిన పోస్టుల్లో ఇంకెవరినైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి బారికేడ్లపై నిలబడ్డ కొందర్ని సర్కిల్ చేసి ఫొటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే.
Similar News
News September 13, 2024
‘హైడ్రా’పై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు
TG: సంచలనం సృష్టిస్తున్న ‘హైడ్రా’పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైడ్రా(జీవో 99) రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. GHMC యాక్ట్‌ను కాదని, హైడ్రాకు అధికారాల బదిలీ ఎలా చేస్తారని పిటిషనర్ ప్రశ్నించారు. కాగా HYDలోని చెరువుల FTL, బఫర్ జోన్‌లో ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తోంది.
News September 13, 2024
తెలంగాణ ప్రజాపాలన దినోత్సవానికి కేంద్రమంత్రులకు సీఎం ఆహ్వానం
TG: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈనెల 17న నిర్వహించనున్న ‘తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం’ కార్యక్రమానికి హాజరుకావాలంటూ నలుగురు కేంద్రమంత్రులకు CM రేవంత్ ఆహ్వానం పంపారు. వీరిలో అమిత్ షా, గజేంద్ర షెకావత్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఉన్నారు. 1948 SEP 17న TGలో ప్రజాస్వామిక పాలన శకం ఆరంభమైన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని CM తెలిపారు. ఆరోజు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆయన జెండా ఆవిష్కరిస్తారు.
News September 13, 2024
VLSRSAM క్షిపణుల ప్రయోగం విజయవంతం
ఉపరితలం నుంచి గగనతలంపైకి ప్రయోగించగల ‘వెర్టికల్ లాంఛ్’ స్వల్ప పరిధి క్షిపణుల్ని(VLSRSAM) భారత్ నిన్న, ఈరోజు విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ITR)లో ఈ ప్రయోగాన్ని నిర్వహించినట్లు డీఆర్‌డీఓ ప్రకటించింది. తక్కువ ఎత్తులో తీవ్రవేగంతో ఎగిరే లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ఛేదించామని తెలిపింది. శత్రు విమానాలు, హెలీకాప్టర్లు, డ్రోన్ల వంటివాటిని ఈ క్షిపణులు నేలకూల్చగలవు.