News June 17, 2024

హజ్ యాత్రలో 19 మంది యాత్రికులు మృతి

image

ముస్లింల పవిత్ర హజ్ యాత్రలో ఎండ వేడికి తాళలేక 19 మంది యాత్రికులు మరణించారు. వీరంతా జోర్డాన్, ఇరాన్‌కు చెందిన వారని అధికారులు తెలిపారు. అధికారులు ఎండ నుంచి ఉపశమనం కలిగించే ఏర్పాట్లు చేసినా మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మక్కాలో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో ఎండలకు తాళలేక 240 మంది మరణించారు. కాగా ఎల్లుండితో హజ్ యాత్ర ముగియనుంది.

Similar News

News January 17, 2025

భారత బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కొటక్!

image

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో పరాజయం తర్వాత భారత జట్టులో BCCI కీలక మార్పులకు సిద్ధమైంది. అందులో భాగంగానే బ్యాటింగ్ కోచ్‌గా సితాంశు కొటక్‌ను నియమించినట్లు క్రీడావర్గాలు చెబుతున్నాయి. దీనిపై అతిత్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నాయి. ఈనెల 22న ఇంగ్లండ్‌తో మొదలయ్యే సిరీస్‌ నుంచి సితాంశు బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరిస్తారని సమాచారం.

News January 17, 2025

ఇది మా కుటుంబానికి కఠినమైన రోజు: కరీనా

image

సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. ఇది తమ కుటుంబానికి చాలా కఠినమైన రోజు అని ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని రాసుకొచ్చారు.

News January 17, 2025

ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా: KTR

image

TG: ఈడీ విచారణ అనంతరం ఇంటికి చేరుకున్న మాజీ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈడీ ఆఫీస్ ముందు మీడియాతో మాట్లాడిన ఫొటోలను షేర్ చేసిన ఆయన ‘ట్రూత్ ఈజ్ ది ఓన్లీ ఫార్ములా’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఫార్ములా-ఈ కారు రేస్ వ్యవహారంలోనే కేటీఆర్‌పై కేసు నమోదైన విషయం తెలిసిందే.