News January 17, 2025

ఇది మా కుటుంబానికి కఠినమైన రోజు: కరీనా

image

సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి ఘటనపై సతీమణి, హీరోయిన్ కరీనా కపూర్ స్పందించారు. ఇది తమ కుటుంబానికి చాలా కఠినమైన రోజు అని ఇన్‌స్టాలో ఎమోషనల్ పోస్టు చేశారు. ‘అసలు ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కష్ట సమయంలో అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు. మీడియా ప్రతినిధులు ఊహాజనిత కథనాలకు దూరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ ఘటన నుంచి తేరుకునేందుకు కొంత సమయం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నా’ అని రాసుకొచ్చారు.

Similar News

News April 17, 2026

అయినవిల్లి: విద్యుత్ షాక్‌తో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ మృతి

image

అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గ్రామానికి చెందిన ఉండ్రాజవరపు శ్రీను(43) అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ విద్యుత్ తీగ తగిలి శుక్రవారం అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు సమాచారం మేరకు.. అదే గ్రామంలో వీధి దీపాలు వేసేందుకు కరెంటు స్థంభం ఎక్కి లైట్లు బిగిస్తుండగా 11కేవీ వైర్ తగిలి అక్కడి నుంచి ఒక్కసారిగా కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు.

News April 17, 2026

ముర్రా జాతి గేదెలను ఎలా గుర్తించాలి?

image

ముర్రా జాతి గేదెల శరీరం నల్లగా నిగనిగలాడుతూ, మూతి భాగం సన్నగా పొడవుగా గుర్రంలా ఉంటుంది. ఈ జాతి గేదెల కొమ్ములు పొడవుగా పెరగకుండా, లోపలికి వంపు తిరిగినట్లు ఉంటాయి. ఈ పశువుల ముందు భాగం సన్నగా, వెనుక భాగం లావుగా ఉంటుంది. తోక కూడా నల్లగా, కొన్ని పశువులకు చివరన తెల్లకుచ్చు ఉంటుంది. పాల పొదుగులో ముందు రెండు చనుమొనలు కొంత పొట్టిగా, వెనుకవి రెండూ పొడవుగా ఉండడం ఈ జాతిలో కనిపించే మరో లక్షణం.

News April 17, 2026

జగన్ విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి

image

YCP చీఫ్ జగన్ విదేశాలకు వెళ్లేందుకు CBI కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15వ తేదీ మధ్య 2 వారాలు యూరప్, యూకే వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్ కోర్టును కోరారు. సానుకూలంగా స్పందించిన కోర్టు రూ.లక్ష పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది. అలాగే విదేశాల నుంచి వచ్చాక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరు కావాలంది. పర్యటన వివరాలు కోర్టు, CBIకి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.