News March 19, 2024
19 మంది వాలంటీర్లపై వేటు
AP: ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వాలంటీర్లకు అధికారులు షాక్ ఇచ్చారు. ‘సిద్ధం’ సభలో పాల్గొనడంతో అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 16 మంది వాలంటీర్లపై వేటు పడింది. అంబాజీపేట మండలం మొసలపల్లి, వాకలగరువు, ఇరుసుమండకు చెందిన వాలంటీర్లను సస్పెండ్ చేశారు. ఇటు అనకాపల్లి(D)లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఇద్దరిని విధుల నుంచి తొలగించారు. పల్నాడు(D) పెదకూరపాడులో పార్టీ మీటింగ్‌లో పాల్గొన్న ఓ వాలంటీర్‌పై వేటు వేశారు.
Similar News
News September 16, 2024
చేతికి ఫ్రాక్చర్‌తో మ్యాచ్‌లో పాల్గొన్న నీరజ్
బ్రస్సెల్స్‌లో జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ జావెలిన్ త్రో స్టార్ రెండో స్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌ను తాను విరిగిన చేతితో ఆడాడని X ద్వారా వెల్లడించారు. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డానని, ఎక్స్ రేలో తన ఎడమ చేతిలో నాల్గవ మెటాకార్పల్ ఎముక విరిగిందని తెలిపారు. డాక్టర్ల సహకారంతో ఫైనల్ ఆడగలిగాని తెలిపారు. ఆట పట్ల అతడికున్న నిబద్ధతపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
News September 16, 2024
మందుబాబులకు బిగ్ రిలీఫ్.. తగ్గనున్న మద్యం ధరలు?
AP: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కంటే తక్కువగా మద్యం ధరలు ఉండేలా GOVT కొత్త లిక్కర్ పాలసీ రూపొందిస్తున్నట్లు సమాచారం. 2019 కంటే ముందు APలో అమలైన పాలసీనే మళ్లీ తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. విధివిధానాలను క్యాబినెట్ సబ్ కమిటీ దాదాపు ఖరారు చేసింది. అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలని కమిటీ నిర్ణయించింది. క్యాబినెట్ ఆమోదం తర్వాత OCT 1 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వచ్చే అవకాశముంది.
News September 16, 2024
మోదీ 3.0: ఈసారే జమిలి ఎన్నికలు!
ప్రస్తుత NDA పాలనలోనే ‘వన్ నేషన్, వన్ ఎలక్షన్’ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ్టితో మోదీ 3.0 పాలన 100 రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ వార్తలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఈఏడాది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఎర్రకోటపై తన ప్రసంగంలో మోదీ జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఆ తర్వాత మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షత ఏర్పాటు చేసిన కమిటీ కేంద్రానికి నివేదిక కూడా సమర్పించింది.