News September 15, 2024
రూ.2.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత
FY2022-23లో ₹1.01 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేత జరగగా, FY2023-24లో ఆ మొత్తం ₹2.01 లక్షల కోట్లుగా నమోదైనట్లు DGGI వెల్లడించింది. ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో అత్యధికంగా ₹81,875cr ఎగవేత జరిగినట్లు తెలిపింది. ఆ తర్వాత బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్(₹18,961cr), ఖనిజాలు(₹16,806cr), పొగాకు, సిగరెట్ ఉత్పత్తులు(₹5,794cr), కాంట్రాక్టు సర్వీసెస్(₹3,846cr) రంగాలు ఉన్నాయని పేర్కొంది.
Similar News
News October 7, 2024
ఆరో రోజు ‘అలిగిన బతుకమ్మ’
TG: బతుకమ్మ వేడుకల్లో ఆరో రోజును ‘అలిగిన బతుకమ్మ’గా పిలుస్తారు. పూర్వం బతుకమ్మను పేర్చే సమయంలో మాంసం తగిలి అపవిత్రం జరిగిందని ప్రచారంలో ఉంది. దీంతో ఇవాళ బతుకమ్మను తయారు చెయ్యరు. నైవేద్యం కూడా సమర్పించరు. అలక వీడాలని అమ్మవారిని మహిళలు ప్రార్థిస్తారు. అటు ఈరోజు దుర్గామాత శ్రీమహాచండీదేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు.
News October 7, 2024
మంత్రి సురేఖను తప్పిస్తారంటూ ప్రచారం.. పీసీసీ చీఫ్ ఏమన్నారంటే?
TG: సురేఖను మంత్రి వర్గం నుంచి తొలగిస్తారని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని PCC చీఫ్ మహేశ్ కుమార్ ఖండించారు. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడంతో వివాదం ముగిసిందని తెలిపారు. దీనిపై ఏఐసీసీ ఎలాంటి వివరణ అడగలేదని మీడియాకు చెప్పారు. సోషల్ మీడియాలో కొందరు కావాలనే బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News October 7, 2024
సింగరేణి లాభాలు.. అత్యధికం ఎవరికంటే?
TG: సింగరేణి లాభాల వాటాలో అత్యధికంగా మంచిర్యాల(D) శ్రీరాంపూర్ SRP-1 ఎస్డీఎల్ ఆపరేటర్ ఆసం శ్రీనివాస్ రూ.3.24 లక్షలు పొందారని AITUC అధ్యక్షుడు సీతారామయ్య వెల్లడించారు. ఆ తర్వాత మందమర్రి KK-5లో చేసే జనరల్ మజ్దూర్ రాజు రూ.3.1 లక్షలు, శ్రీరాంపూర్ ఆర్కే-5కు చెందిన SDL ఆపరేటర్ ఆటికం శ్రీనివాస్ రూ.3.01 లక్షల లాభాల వాటా పొందారని తెలిపారు. వీరికి ఇవాళ C&MD కార్యాలయంలో చెక్కులు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.