News June 1, 2024
ఏపీలో వైసీపీకి 2-4 ఎంపీ సీట్లు: ఇండియా టుడే
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీకి ఈసారి 2-4 ఎంపీ సీట్లు వస్తాయని ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే వెల్లడించింది. కూటమికి 21-23 సీట్లు వస్తాయని అంచనా వేసింది. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్‌ను ఆదివారం సాయంత్రం ప్రకటిస్తామని తెలిపింది. దేశంలో పోల్ సర్వేల్లో ఇండియా టుడే మై యాక్సిస్‌కు విశ్వసనీయత ఎక్కువ. ఇప్పటివరకు వచ్చిన అంచనాలు మిక్స్‌డ్‌గా ఉండటంతో ఈ సంస్థ ఏం చెప్పబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
Similar News
News September 17, 2024
త్రివిక్రమ్‌ను ప్రశ్నించండి: పూనమ్
జానీ మాస్టర్‌పై రేప్ కేసు నమోదవడంతో ఇండస్ట్రీలోని పలువురు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడేందుకు ముందుకొస్తున్నారు. తాజాగా నటి పూనమ్ కౌర్ తాను డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై గతంలో ‘మా’కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ‘అప్పుడే అతడిపై “మా” చర్యలు తీసుకుని ఉంటే ఈరోజు ఇంతమంది బాధపడేవారు కాదు. త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు.
News September 17, 2024
Stock Market: ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు
US ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు జాగ్రత్తపడ్డారు. సెన్సెక్స్ రోజంతా 82,866 – 83,153 మధ్య కన్సాలిడేట్ అవుతూ చివరికి 90 పాయింట్ల లాభంతో 83,079 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 34 పాయింట్ల లాభంతో 25,418 వద్ద నిలిచింది. హీరో మోటార్స్, బజాజ్ ఆటో, Airtel టాప్ గెయినర్స్. టాటా మోటార్స్, ఐచర్, టాటా స్టీల్, కోల్ ఇండియా, JSW Steel టాప్ లూజర్స్.
News September 17, 2024
మహిళా లాయర్లకు అత్యాచార బెదిరింపులు!
కోల్‌కతా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో బెంగాల్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న మహిళా న్యాయవాదులకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని లాయర్ కపిల్ సిబల్ తెలిపారు. ఈ కేసుపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తమ మహిళా లాయర్లపై యాసిడ్ పోస్తామని, రేప్ చేస్తామని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నట్లు ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. దీంతో వారి భద్రతకు చర్యలు తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది.