News April 5, 2025

EAPCETకు 2.91లక్షల దరఖాస్తులు

image

TG EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం వరకు మొత్తం 2,91,965 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్‌కు 2,10లక్షలు, అగ్రికల్చర్‌కు 81,172, రెండింటి కోసం 226 మంది అప్లై చేశారు. దరఖాస్తు చేసుకోని వారు రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 8 వరకు, రూ.500 లేట్ ఫీజుతో 14వ తేదీ వరకు, రూ.5వేలతో ఈనెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు.

Similar News

News September 17, 2025

పాకిస్థాన్‌తో మ్యాచ్.. యూఏఈ బౌలింగ్

image

ఆసియాకప్‌లో పాకిస్థాన్ ఆడటంపై ఎట్టకేలకు సస్పెన్స్ వీడింది. యూఏఈతో మ్యాచులో టాస్ కోసం ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ మైదానంలోకి వచ్చారు. టాస్ గెలిచిన యూఏఈ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు సూపర్-4 చేరనుంది.

News September 17, 2025

బాయ్‌కాట్ చేస్తే పాకిస్థాన్‌ ఎంత నష్టపోయేది?

image

ఆసియా కప్‌లో భాగంగా UAEతో మ్యాచ్‌ను ఒకవేళ పాకిస్థాన్ బాయ్‌కాట్ చేసి ఉంటే ఆర్థికంగా భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది. ఆ దేశ క్రికెట్ బోర్డు సుమారు ₹145కోట్ల ఆదాయం కోల్పోయేది. ఇక మ్యాచ్‌ను ఉద్దేశపూర్వకంగా బాయ్‌కాట్ చేసినందుకు క్రమశిక్షణ ఉల్లంఘన చర్యల కింద సుమారు రూ.140కోట్లు ICCకి చెల్లించాల్సి ఉండేదని విశ్లేషకులు అంచనా వేశారు. అంటే మొత్తంగా రూ.285కోట్ల భారం మోయాల్సి వచ్చేదన్నమాట.

News September 17, 2025

BlackBuck సంస్థకు మంత్రి లోకేశ్ ఆహ్వానం

image

AP: బెంగళూరు నుంచి తమ ఆఫీసును తరలించాలని అనుకుంటున్నట్లు BlackBuck సంస్థ CEO రాజేశ్ పెట్టిన పోస్టుకు మంత్రి లోకేశ్ స్పందించారు. ఆ కంపెనీని వైజాగ్‌కు రీలొకేట్ చేసుకోవాలని కోరారు. ఇండియాలో టాప్-5 క్లీనెస్ట్ సిటీల్లో వైజాగ్ ఒకటని పేర్కొన్నారు. ‘ఆఫీసుకి వచ్చి వెళ్లేందుకు 3hr+ పడుతోంది. 9 ఏళ్లుగా ORR ఆఫీస్+ఇల్లుగా మారింది. ఇక ఇక్కడ ఉండలేం. రోడ్లు గుంతలు, దుమ్ముతో నిండిపోయాయి’ అని రాజేశ్ పేర్కొన్నారు.