News April 11, 2025

స్టాక్ మార్కెట్లకు 2 రోజులు సెలవులు

image

వచ్చేవారం స్టాక్ మార్కెట్లు మూడు రోజులే నడవనున్నాయి. రెండు రోజులు సెలవులు ఉంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా సోమవారం మార్కెట్లు తెరుచుకోవు. మంగళ, బుధ, గురువారం వర్కింగ్ డేస్ కాగా గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని శుక్రవారం హాలిడే ఉండనుంది. శని, ఆదివారం యథావిధిగా వారాంతపు సెలవులు కొనసాగనున్నాయి. కాగా ఇవాళ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసిన <<16065141>>విషయం<<>> తెలిసిందే.

Similar News

News April 14, 2026

ఆస్ట్రేలియాలో ఐపీఎల్.. ఇండియాలో BBL?

image

IPL-2027లో ఒక మ్యాచును AUSలోని అడిలైడ్ ఓవల్ స్టేడియం హోస్ట్ చేసే అవకాశముంది. అక్కడ భారతీయులు ఎక్కువగా ఉండటంతో మ్యాచుకు క్రేజ్ ఎక్కువగా ఉంటుందని స్టేడియం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. అలాగే AUSలో జరిగే ‘బిగ్‌బాష్ లీగ్’ మ్యాచునూ INDలో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. దీనికోసం చెన్నై స్టేడియాన్ని పరిశీలిస్తున్నట్లు టాక్. త్వరలోనే BCCIతో దీనిపై చర్చలు జరిగే ఛాన్సుంది.

News April 14, 2026

హోటల్ బిల్లులు చెల్లించలేక పాక్ అభాసుపాలు

image

US-ఇరాన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన పాక్ అందుకు వేదికైన హోటల్‌కు బిల్లులు చెల్లించలేక అభాసుపాలైంది. ఈనెల 10-12 తేదీల్లో ఇస్లామాబాద్‌లోని సెరీనా హోటల్లో 2దేశాల ప్రతినిధులు చర్చలు జరిపారు. అయితే ఆ బిల్లులు ప్రభుత్వం కట్టకపోవడంతో చివరకు ఆ హోటల్ యజమానే దాన్ని భరించాల్సి వచ్చింది. ఈ హోటల్‌లో ప్రెసిడెంట్ సూట్ ధర ఒక రాత్రికి ₹2.21లక్షలు కాగా స్టాండర్డ్ రూమ్స్ ₹14,896/నైట్ ఉన్నట్లు సమాచారం.

News April 14, 2026

వాహనదారులకు అలర్ట్.. రేపటి నుంచి కొత్త రూల్స్

image

NHలపై ఓవర్ లోడ్‌తో వెళ్లే వాహనాలకు కేంద్రం రేపటి నుంచి కొత్త టోల్ రూల్ అమలు చేయనుంది. పరిమితికి మించి వాహనం మోసుకెళ్లే అదనపు బరువును బట్టి ఫైన్ విధించనుంది. ఓవర్ లోడ్ 10%లోపు ఉంటే ఎలాంటి ఫైన్ ఉండదు. 10-40% ఉంటే సాధారణ టోల్ రేటుకు 2 రెట్లు, 40%+ ఉంటే 4 రెట్లు ఎక్కువగా చెల్లించాలి. కేవలం ఫాస్టాగ్ ద్వారా దీనిని వసూలు చేస్తారు. టోల్ ప్లాజా వద్ద బరువును కొలిచే మెషీన్లు లేకపోతే ఫైన్ ఉండదు.