News February 19, 2025
2 రోజులు సెలవు

AP: పట్టభద్రుల, టీచర్స్ MLC స్థానాలకు ఎన్నికలు జరిగే జిల్లాల్లో(ఉమ్మడి గోదావరి జిల్లాలు, గుంటూరు-కృష్ణా గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్ర టీచర్స్) 2 రోజులు సెలవు ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు. పోలింగ్ ముందు రోజు FEB 26, పోలింగ్ రోజైన 27 తేదీల్లో సెలవు ఇవ్వాలని, అవసరమైతే కౌంటింగ్(MAR 3) రోజునా సెలవు ఇవ్వాలని పేర్కొన్నారు. మొత్తం 16 జిల్లాల్లో MLC ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Similar News
News March 28, 2025
నితిన్ ‘రాబిన్‌హుడ్’ పబ్లిక్ టాక్!

నితిన్, శ్రీలీల జంటగా నటించిన ‘రాబిన్‌హుడ్’ ఈరోజు రిలీజైంది. ఓవర్సీస్ ప్రీమియర్స్‌లో మిక్స్‌డ్ టాక్ వస్తోంది. కామెడీ అదిరిపోయిందని, చాలా నవ్వించారని కొందరు పోస్టులు పెడుతుంటే మరికొందరైతే రొటీన్ స్టోరీ అంటున్నారు. డేవిడ్ వార్నర్ సర్‌ప్రైజ్ బాగుందని, కానీ వెంకీ కుడుముల మార్క్ ఎక్కడో మిస్ అయిందంటున్నారు. జీవీ ప్రకాశ్ తన మ్యూజిక్‌తో మ్యాజిక్ చేయలేకపోయారని చెబుతున్నారు. కాసేపట్లో Way2News రివ్యూ.
News March 28, 2025
విషాదం: విషమిచ్చిన తల్లి.. ముగ్గురు పిల్లల మృతి!

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు బిడ్డలకు నిన్న రాత్రి పెరుగన్నంలో విషం కలిపి తినిపించి అనంతరం తానూ తీసుకుంది. ఉదయం భర్త వచ్చేసరికి ముగ్గురు బిడ్డలు సాయి కృష్ణ(12), మధుప్రియ(10), గౌతమ్(8) విగతజీవులుగా కనిపించారు. తల్లిని ఆస్పత్రికి తరలించగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
News March 28, 2025
అంచనాలే సన్‌రైజర్స్ కొంపముంచాయా?

IPLలో SRHపై ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కాదు. తరచూ 250కి పైగా స్కోర్లు నమోదు చేస్తుండటంతో SRH ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన ప్రతిసారీ 300 రన్స్ గురించే చర్చ నడుస్తోంది. ఆ రికార్డు సన్‌రైజర్స్‌కు మాత్రమే సాధ్యమన్న అంచనాలు ఆటగాళ్లపై ఒత్తిడి పెంచి ఉండొచ్చంటూ క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. తొలి మ్యాచ్‌లో స్వేచ్ఛగా ఆడిన అదే జట్టు, నిన్న అతి కష్టంగా 190 రన్స్ చేసిందని గుర్తుచేస్తున్నారు.