News September 11, 2024
రాష్ట్రానికి మరో 2 మెడికల్ కళాశాలలు

AP: రాష్ట్రంలో కొత్తగా రెండు మెడికల్ కళాశాలలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని కడప, పాడేరులో ఏర్పాటు చేయనున్నారు. కాగా గతేడాది జూన్లో 5 వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేసింది. మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరంలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి.
Similar News
News January 3, 2026
‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

పాక్తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.
News January 3, 2026
ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>
News January 3, 2026
వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతోంది: రాజ్నాథ్

దేశంలో వైట్ కాలర్ ఉగ్రవాదం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఉన్నత విద్యావంతులు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పారు. <<18265346>>ఢిల్లీ పేలుడు<<>> ఘటనను ఈ సందర్భంగా ప్రస్తావించారు. జ్ఞానంతోపాటు విలువలు, వ్యక్తిత్వం కూడా అవసరమని చెప్పారు. విద్య ఉద్దేశం వృత్తిపరమైన విజయం మాత్రమే కాదని, నైతికత, నీతి, కార్యక్టర్ను అభివృద్ధి చేసుకోవడమని చెప్పారు.


