News September 11, 2024

రాష్ట్రానికి మరో 2 మెడికల్ కళాశాలలు

image

AP: రాష్ట్రంలో కొత్తగా రెండు మెడికల్ కళాశాలలకు అనుమతిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతుల ప్రారంభానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వీటిని కడప, పాడేరులో ఏర్పాటు చేయనున్నారు. కాగా గతేడాది జూన్‌లో 5 వైద్య కళాశాలలను కేంద్రం మంజూరు చేసింది. మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, ఏలూరు, విజయనగరంలో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికే అక్కడ తరగతులు కూడా జరుగుతున్నాయి.

Similar News

News October 5, 2024

హైడ్రాకు చట్టబద్ధత.. గెజిట్ విడుదల

image

TG: హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది. HYDలో చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను హైడ్రా కూల్చివేస్తున్న విషయం తెలిసిందే. అయితే చట్టబద్ధత లేదంటూ విమర్శలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దానికి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

News October 5, 2024

తెలుగు సినిమా షూటింగ్ నుంచి పారిపోయిన ఏనుగు

image

కేరళలో చిత్రీకరణ జరుపుకొంటున్న ఓ తెలుగు సినిమా సెట్ నుంచి పుత్తుప్పలి సాధు అనే ఏనుగు పారిపోయింది. నిన్న రాత్రి షూటింగ్ పూర్తయ్యే సమయానికి ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వెనుకవైపు నుంచి మరో ఏనుగు ఢీ కొట్టడంతో భయపడి సమీపంలోని అడవిలోకి సాధు పరిగెత్తిందని స్థానిక అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈరోజు ఉదయం ఏనుగును పట్టుకున్నామని, ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలూ కాలేదని పేర్కొన్నారు.

News October 5, 2024

రుణమాఫీ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకుందా?: మోదీ

image

మహారాష్ట్రలో పీఎం కిసాన్ నిధుల విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు. ‘రైతులకు రుణమాఫీ చేస్తామనే హామీతో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అధికారం చేపట్టి ఇన్ని రోజులైనా ఎందుకు చేయడం లేదని అక్కడి రైతులు ప్రశ్నిస్తున్నారు. మహారాష్ట్ర రైతులు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. మహా వికాస్ అఘాడీ కూటమిని ఓడించాలి’ అని మోదీ పిలుపునిచ్చారు.