News August 13, 2024

ఎమ్మెల్సీ స్థానానికి 2 నామినేషన్లు.. 30న పోలింగ్

image

AP: స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ, స్వతంత్ర అభ్యర్థిగా షఫీ ఉల్లా నామినేషన్ దాఖలు చేశారు. టీడీపీ పోటీ చేయకూడదని నిర్ణయించిన సంగతి తెలిసిందే. మొత్తంగా రెండే నామినేషన్లు రావడం గమనార్హం. రేపు నామినేషన్ల పరిశీలన చేయనున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.

Similar News

News September 17, 2024

ముఖ్యమంత్రి పదవికి కేజ్రీవాల్ రాజీనామా

image

ఢిల్లీ సీఎం పదవికి అర‌వింద్ కేజ్రీవాల్ రాజీనామా చేశారు. ఈ మేర‌కు ఆయ‌న రాజ్ భవన్‌లో లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ వీకే స‌క్సేనాను క‌ల‌సి రాజీనామా లేఖ‌ను అంద‌జేశారు. వారం రోజుల్లో ఆతిశీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అప్పటివరకు కేజ్రీవాల్ ఆపద్ధర్మ సీఎంగా కొనసాగనున్నారు.

News September 17, 2024

రేపు ఉదయంలోగా నిమజ్జనాలు పూర్తి: సీపీ

image

TG: హైదరాబాద్ నగరంలో వినాయకుల నిమజ్జనాలు ప్రశాంతంగా జరుగుతున్నాయని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. రేపు ఉదయం నాటికి ఈ ప్రక్రియ ముగుస్తుందని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే భక్తులు ప్రైవేట్ వాహనాలు కాకుండా ప్రజారవాణాను ఉపయోగించుకోవాలని సూచించారు. అటు నిమజ్జన ప్రక్రియను మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, సీవీ ఆనంద్ హెలికాప్టర్ ద్వారా వీక్షించారు.

News September 17, 2024

‘బిగ్ బాస్’ ఫేమ్ సోహెల్‌ తల్లి కన్నుమూత

image

‘బిగ్ బాస్’ ఫేమ్, సినీ నటుడు సోహెల్ ఇంట విషాదం చోటు చేసుకుంది. అనారోగ్య కారణాలతో ఆయన తల్లి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సోహెల్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసి. దీంతో ఆమె పార్థీవదేహాన్ని స్వస్థలానికి తరలించారు. ‘కొత్త బంగారు లోకం’తో సోహెల్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. లక్కీ లక్ష్మణ్, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి చిత్రాల్లో ఆయన హీరోగా నటించారు.