News January 3, 2025
2 వికెట్లు డౌన్.. పెవిలియన్‌కు భారత ఓపెనర్లు
సిడ్నీలో జరుగుతున్న ఐదో టెస్టులో భారత జట్టుకు తొలి 10 ఓవర్లలోనే షాక్ తగిలింది. ఓపెనర్లలో తొలుత రాహుల్ (4), తర్వాత జైస్వాల్ (10) ఔట్ అయ్యారు. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ(4), గిల్(3) ఉన్నారు. కోహ్లీ క్రీజులోకి రాగానే తొలి బంతి ఎడ్జ్ తీసుకొని స్లిప్‌లోకి వెళ్లింది. తొలుత అందరూ ఔట్ అని భావించినా బాల్ గ్రౌండ్‌ను తాకడంతో థర్డ్ అంపైర్ నాటౌట్‌గా ప్రకటించారు. 9 ఓవర్లకు భారత స్కోర్ 22/2.
Similar News
News January 14, 2025
అడిగిన ప్రతి రైతుకూ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు: సీఎం చంద్రబాబు
AP: సంక్షేమ పథకాల అమలులో మోసాలు జరగకుండా సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. రైతుల అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అడిగిన ప్రతి ఒక్కరికీ డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందిస్తామని, పశువులకు షెడ్లు నిర్మిస్తామని ప్రకటించారు. కిరాణా దుకాణాల ద్వారా సరకుల పంపిణీ చేపడతామన్నారు. ప్రజల ఆదాయం పెంచడం, పర్యావరణ పరిరక్షణే తన లక్ష్యమని పేర్కొన్నారు.
News January 14, 2025
సేంద్రియ సాగుకు మరింత ప్రోత్సాహం: సీఎం
AP: రాష్ట్రంలో సేంద్రియ సాగుకు తానే శ్రీకారం చుట్టానని, రానున్న రోజుల్లో మరింత ప్రోత్సహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. నారావారిపల్లెలో మాట్లాడుతూ ‘ప్రపంచ దేశాలన్నీ ప్రకృతి సేద్యం వైపు చూస్తున్నాయి. అలాంటి ఉత్పత్తులకు మార్కెట్‌లో మంచి ధర వస్తోంది. ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన పెరిగింది. తినే ఆహారం ఎలాంటిదో, ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసుకునే అవకాశం వచ్చింది’ అని తెలిపారు.
News January 14, 2025
భారీగా పతనమైన HCL స్టాక్స్
Q3 ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ దేశంలో మూడో అతిపెద్ద IT దిగ్గజం HCL Technologies షేర్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. గత సెషన్‌లో స్థిరపడిన ₹1,975 నుంచి ₹1,819 వరకు 8.52% మేర పతనమయ్యాయి. Q3లో ₹4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంస్థ గత క్వార్టర్ కంటే 8.5% వృద్ధిని నమోదు చేసింది. ఫలితాలు ఆశించిన మేర లేకపోవడం, కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి.