News April 10, 2026

20 నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు.. వాట్సాప్‌లో హాల్ టికెట్లు

image

తెలంగాణ సార్వత్రిక విద్యా పీఠం(టాస్) ఆధ్వర్యంలో పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఈ నెల 20 నుంచి 27 వరకు నిర్వహించనున్నట్లు ఖమ్మం డీఈవో చైతన్య జైనీ తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్‌లైన్ ద్వారా లేదా 80969 58096 నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని సందేశం పంపి డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News April 20, 2026

KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

image

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే

image

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.