News May 3, 2024

పాకిస్థాన్‌లో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి

image

పాకిస్థాన్‌లోని గిల్గిత్-బల్తిస్థాన్ పరిధిలోని దియామర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రావల్‌పిండీ నుంచి హన్జా వెళ్తున్న బస్సు అదుపు తప్పి ప్రమాదానికి గురికావడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఘటన జరిగిన సమయంలో బస్సులో ఎంత మంది ఉన్నారనేది తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

Similar News

News December 6, 2025

తమిళనాడులో ప్రమాదం.. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు మృతి

image

తమిళనాడులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. అర్ధరాత్రి రామనాథపురంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఏపీకి చెందిన అయ్యప్ప భక్తులు రామేశ్వరం ఆలయానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఐదుగురు మరణించగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులు విజయనగరం జిల్లా కొరప కొత్తవలస, మరుపల్లికి చెందినవారిగా గుర్తించారు.

News December 6, 2025

చలికాలంలో ఉదయాన్నే వాకింగ్‌తో నష్టాలే ఎక్కువ!

image

వాకింగ్ శరీరానికి ఎంతో మంచిది. కానీ చలికాలం ఉదయాన్నే చేసే వాకింగ్‌తో లాభంకంటే నష్టాలే ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. ‘చల్లటి గాలి ఊపిరితిత్తులపై ఒత్తిడి తెస్తుంది. BP పెరిగి గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. సడెన్‌గా చలిలోకి వెళ్లడంతో ఇమ్యూనిటీ ప్రభావం పడుతుంది. దాంతో తరచూ జలుబు చేసే ప్రమాదం ఉంటుంది. మంచులో రోడ్డు సరిగ్గా కనిపించక పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది’ అని హెచ్చరిస్తున్నారు.

News December 6, 2025

కోళ్లలో కొక్కెర వ్యాధి.. నిర్లక్ష్యం చేస్తే తీవ్ర నష్టం

image

కొళ్లలో కొక్కెర వ్యాధి చాలా ప్రమాదకరమైనది. ఇది అన్ని వయసుల కోళ్లకూ సోకుతుంది. దీన్ని రాణిఖేత్ డిసీజ్ అని కూడా అంటారు. ఈ వ్యాధి సోకిన కోళ్లలో 80-90% చనిపోతాయి. ఇది సోకిన కోడి ముక్కు నుంచి కారే ద్రవాల వల్ల, వ్యాధి క్రిములు చేరిన మేత, నీరు, గాలి ద్వారా ఇతర కోళ్లకూ వ్యాపిస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఫారమ్‌లోని కోళ్లన్నీ మరణిస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు, నివారణ సూచనలకు <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.