News August 18, 2024

హ‌రియాణాలో ఎస్సీల‌కు 20% రిజ‌ర్వేష‌న్లు

image

హ‌రియాణాలో షెడ్యూల్డ్ కులాలకు ప్ర‌భుత్వ ఉద్యోగాల్లో 20 శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించ‌డానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎస్సీ క‌మిష‌న్ నివేదిక‌ ఆధారంగా ఈ 20 శాతం కోటాలో 10 శాతం అణగారిన షెడ్యూల్డ్ కులాలకు కేటాయిస్తామని సీఎం న‌యాబ్ సింగ్ సైనీ తెలిపారు. ప్ర‌స్తుతం ఎన్నిక‌ల కోడ్ కార‌ణంగా అసెంబ్లీ ఎన్నిక‌ల త‌రువాత రిజ‌ర్వేష‌న్లు అమ‌ల్లోకొస్తాయ‌ని తెలిపారు.

Similar News

News September 12, 2024

చెన్నైలో పుట్టి.. హైదరాబాద్‌లో పెరిగి..

image

సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి కన్నుమూశారు. 1952 ఆగస్టు 12న చెన్నైలో ఈ కమ్యూనిస్టు దిగ్గజం జన్మించారు. ఆయన తల్లిదండ్రులు ఏపీలోని కాకినాడ వాసులు. సీతారాం విద్యాభ్యాసం హైదరాబాద్‌లో సాగింది. ఆ తర్వాత ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఆర్థికశాస్త్రంలో బీఏ, జవహర్ లాల్ వర్సిటీలో ఎంఏ పూర్తి చేశారు. 1974లో SFIలో చేరిన సీతారాం, ఏడాది తర్వాత CPM పార్టీలో చేరి ఆయన అంచెలంచెలుగా ఎదిగారు.

News September 12, 2024

నూడిల్స్ తింటున్నారా?

image

నూడిల్స్‌ను తినడం మానుకోవడం మంచిదని ఆస్ట్రేలియన్ హెల్త్ ప్రమోటర్ బార్బరా ఓ’నీల్ తెలిపారు. ముఖ్యంగా పిల్లలకు ఈ ఆహారం అందించడాన్ని ఆపేయాలని హెచ్చరించారు. నూడుల్స్‌లో పోషకాలు శూన్యమని, గోధుమ, సింథటిక్ & MSG, కార్సినోజెనిక్ ప్రిజర్వేటివ్‌లతో నిండి ఉంటుందని చెప్పారు. నూడుల్స్ తినడం వల్ల జీర్ణాశయంలో మంటగా ఉంటుందని, క్రమంగా రుచిని గుర్తించే స్వభావం తగ్గుతుందన్నారు.

News September 12, 2024

కాబోయే భర్తకు రూ.30 లక్షల జీతం ఉండాలి.. డివోర్స్‌డ్ మహిళ పోస్ట్!

image

నాగ్‌పూర్‌కు చెందిన డివోర్స్‌డ్ మహిళ తనకు కాబోయే భర్తకు ఉండాల్సిన క్వాలిటీస్‌ గురించి చేసిన ఓ ప్రకటన వైరలవుతోంది. ‘నాకు 39 ఏళ్లు. ఏడాదికి రూ.1.3లక్షలు సంపాదిస్తా. కాబోయే భాగస్వామి అవివాహితుడై ఉండాలి. ఏడాదికి రూ.30 లక్షల జీతం రావాలి. 3BHK ఫ్లాట్ ఉండాలి. నాతోపాటే నా తల్లిదండ్రులు కూడా ఉంటారు. ఇంటి పనుల కోసం పనిమనిషిని ఉంచాలి. అత్తామామలతో ఉండలేను. వరల్డ్ టూర్‌కు తీసుకెళ్లాలి’ అని ప్రకటనలో ఉంది.