News March 20, 2024
‘UBER’కు రూ.20వేల ఫైన్!

బుక్ చేసే సమయంలో చూపిన ఛార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసినందుకు UBER కంపెనీకి కన్జూమర్ కోర్టు రూ.20వేల జరిమానా విధించింది. చండీగఢ్‌కు చెందిన ప్రశార్ 2021 ఆగస్టు 6న ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. 8.83కిలో మీటర్లకు రూ.359 చూపించగా.. గమ్యం చేరే సమయానికి రూ.1334కి చేరుకుంది. అతడి ఫిర్యాదును విచారించిన కోర్టు కస్టమర్ ఖాతాలో పదివేలు, లీగల్ ఎయిడ్ ఖాతాలో పదివేలు జమచేయాలని ఆదేశించింది.
Similar News
News January 25, 2026
ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (1/2)

పాడ్యమి: ఆరోగ్యం, తేజస్సు కోసం అగ్ని దేవుడు.
విదియ: విద్య, జ్ఞానం కోసం బ్రహ్మ దేవుడు.
తదియ: సౌభాగ్యం కోసం, గౌరీ దేవి (పార్వతి).
చతుర్థి: విఘ్నాల తొలగింపు, విజయం కోసం వినాయకుడు.
పంచమి: సంతాన ప్రాప్తి, కుజదోష నివారణకై నాగదేవత.
షష్ఠి: శత్రు జయం, ధైర్యం, దోష వినాశనానికి కుమారస్వామి.
సప్తమి: ఆరోగ్య సిద్ధి, కంటి సమస్యల నివారణకై సూర్యుడు
అష్టమి: భయ నివారణ, రక్షణ కోసం దుర్గాదేవి.
News January 25, 2026
ఏ తిథి రోజున ఎవరిని ఆరాధించాలంటే..? (2/2)

నవమి: కష్టాల తొలగింపు, మేధస్సు కోసం రాముడు.
దశమి: ఆయుష్షు, అపమృత్యు దోష నివారణకై యముడు.
ఏకాదశి: పాప పరిహారం, మోక్షం కోసం విష్ణుమూర్తి.
ద్వాదశి: పుణ్య ఫలం, స్థిరత్వం కోసం వరాహస్వామి.
త్రయోదశి: కోరికలు నెరవేరడం, ఆనందంకై శివుడు.
చతుర్దశి: గ్రహ దోష నివారణ కోసం శివుడు, రుద్రుడు.
పూర్ణిమ: మనశ్శాంతి, ఐశ్వర్యం కోసం చంద్రుడు/లలితా దేవి.
అమావాస్య: పితృ రుణ విముక్తి, వంశాభివృద్ధికై పితృదేవతలు.
News January 25, 2026
రైతులకు శుభవార్త.. భారీగా పెరిగిన వేరుశనగ ధర

గతేడాది ధరలు లేక ఇబ్బందిపడిన వేరుశనగ రైతులకు ఈ ఏడాది ఊరట కలుగుతోంది. ఇటీవల TGలోని కల్వకుర్తి మార్కెట్‌లో క్వింటా ధర గరిష్ఠంగా ₹9,865, వనపర్తిలో ₹9,784, నారాయణపేటలో ₹9,500, APలోని ఆదోని మార్కెట్‌లో నిన్న ₹9,652 పలికింది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయంగా నూనె గింజలకు నెలకొన్న డిమాండే ఇందుకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కాగా గత ఏడాది క్వింటా ధర రూ.7వేల లోపే పలికింది.


