News March 20, 2024
‘UBER’కు రూ.20వేల ఫైన్!
బుక్ చేసే సమయంలో చూపిన ఛార్జీ కంటే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు వసూలు చేసినందుకు UBER కంపెనీకి కన్జూమర్ కోర్టు రూ.20వేల జరిమానా విధించింది. చండీగఢ్‌కు చెందిన ప్రశార్ 2021 ఆగస్టు 6న ఉబర్ క్యాబ్ బుక్ చేశాడు. 8.83కిలో మీటర్లకు రూ.359 చూపించగా.. గమ్యం చేరే సమయానికి రూ.1334కి చేరుకుంది. అతడి ఫిర్యాదును విచారించిన కోర్టు కస్టమర్ ఖాతాలో పదివేలు, లీగల్ ఎయిడ్ ఖాతాలో పదివేలు జమచేయాలని ఆదేశించింది.
Similar News
News September 12, 2024
దేశ విచ్ఛిన్న శక్తులతో చేతులు కలిపిన రాహుల్: బండి సంజయ్
TG: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉగ్ర సంస్థలను సమర్థిస్తున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులతో ఆయన చేతులు కలిపారని దుయ్యబట్టారు. ఆయన భారత్‌ను విడిచి వెళ్లాలన్నారు. కాంగ్రెస్ ఒక దేశ ద్రోహ పార్టీ అని మండిపడ్డారు. దేశంలో సిక్కుల మనుగడకు ప్రమాదం ఉందని రాహుల్ వ్యాఖ్యానించగా, ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నూ సమర్థించిన విషయం తెలిసిందే.
News September 12, 2024
మెటా ఏఐకి పబ్లిక్ ఫిగర్ల వాయిస్!
వాట్సాప్‌లో మెటా ఏఐ చాట్‌బాట్‌కు త్వరలో <<13848701>>వాయిస్ వెర్షన్<<>> రానుంది. దీనిని డిఫరెంట్ వాయిస్‌లలో అందుబాటులోకి తేనున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. మొదటగా ఇంగ్లిష్‌లో పలువురు ప్రజాదరణ పొందిన వ్యక్తుల గొంతులతో తీసుకురానున్నారని, భవిష్యత్తులో ఇతర భాషల్లోనూ అందుబాటులోకి తెస్తారని తెలిపింది. యూజర్లు తమకు నచ్చిన వాయిస్‌ను ఎంచుకుని వాడుకోవచ్చని వివరించింది.
News September 12, 2024
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రోడ్డులో కారు, బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. కంటైనర్ కలకడ నుంచి చెన్నైకి టమాట లోడుతో వెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.