News January 5, 2026
200 ఏళ్లు నిలిచేలా.. రూ.200 కోట్లతో మేడారం ముస్తాబు: మంత్రి పొంగులేటి

మేడారం జాతర కోసం రూ. 200 కోట్లతో చేపట్టిన ఆధునీకరణ పనులు 95 శాతం పూర్తయ్యాయని, ఇవి 200 ఏళ్లు నిలిచేలా రాతి కట్టడాలతో నిర్మించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మండలిలో వెల్లడించారు. జాతర పరిసరాల్లో 10 కి.మీ. మేర నాలుగు లైన్ల రోడ్లు వేశామని, భక్తుల సౌకర్యార్థం మరో 63 ఎకరాలు సేకరిస్తామని తెలిపారు. కుంభమేళా తరహాలో జాతర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
Similar News
News April 20, 2026
KMM: మొక్కజొన్న కొనుగోళ్లపై కలెక్టర్లకు మంత్రి తుమ్మల ఆదేశాలు

మొక్కజొన్న కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చోట అదనపు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మార్క్‌ఫెడ్ ద్వారా 200 కేంద్రాల్లో కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు. కొనుగోలు చేసిన మొక్కజొన్నను వెంటనే గోదాములకు తరలించేలా చర్యలు తీసుకోవాలని మార్క్‌ఫెడ్ అధికారులను సూచించారు.

అందుబాటులోకి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే

జిల్లా ప్రజలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే (ప్యాకేజీ-2) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. వైరా మండలంలోని సోమవరం ఎగ్జిట్ పాయింట్ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన ఈ రహదారిని అధికారులు ప్రారంభించారు. నేటి నుంచి టోల్ వసూళ్లు మొదలయ్యాయి. కాగా, ఈ రహదారిపై ద్విచక్ర వాహనాలు, ఆటోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.