News October 8, 2024
బీజేపీని గెలిపించిన 200 రోజుల ముఖ్యమంత్రి
ఎన్నికలకు 200 రోజుల ముందు హరియాణా CMగా బాధ్యతలు చేపట్టిన నాయబ్ సింగ్ సైనీ BJPని అనూహ్యంగా విజయతీరాలకు చేర్చారు. డమ్మీ CM అని ఎన్ని విమర్శలు వచ్చినా BJP ఎన్నికల ప్రచారం మొత్తం ఆయన చుట్టూనే తిరిగింది. ఫలితాలపై ముందుగానే బాధ్యత వహించిన సైనీ ప్రభుత్వ వ్యతిరేకతలోనూ పార్టీని ముందుండి నడిపారు. అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ హ్యాట్రిక్ విజయానికి కారణమయ్యారు.
Similar News
News November 3, 2024
‘సదర్’కు రాష్ట్ర పండుగ హోదా
TG: రాష్ట్ర ప్రభుత్వం సదర్ సమ్మేళనానికి రాష్ట్ర పండుగ హోదా కల్పించింది. ఈ మేరకు ప్రతి సంవత్సరం రాష్ట్ర పండుగగా నిర్వహించాలని జీవో జారీ చేసింది. HYD మినహా అన్ని జిల్లా కలెక్టర్లకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఎంపీ అనిల్ కుమార్ విజ్ఞప్తితో అంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఈ విషయమై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
News November 3, 2024
విశాఖను లింక్ చేస్తూ ORR: చంద్రబాబు
AP: విశాఖ నగర అభివృద్ధిపై కలెక్టరేట్‌లో CM చంద్రబాబు రివ్యూ చేశారు. నగరంలో పర్యాటక అభివృద్ధికి పెద్దపీట వేయాలని అధికారులను ఆదేశించారు. విజయనగరం, నెల్లిమర్ల, భోగాపురం, అనకాపల్లి ప్రాంతాలను విశాఖకు అనుసంధానం చేస్తూ ORR నిర్మించేలా ప్లాన్ చేయాలని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అనుసంధానించేలా రోడ్ల నిర్మాణం ఉండాలన్నారు. 2047 విజన్ డాక్యుమెంట్ ప్రకారం 15% వృద్ధి సాధించాలని పిలుపునిచ్చారు.
News November 3, 2024
జనవరిలో కొత్త రేషన్ కార్డులు!
AP: నూతన సంవత్సర కానుకగా JANలో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన జంటలతో పాటు అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి కార్డులు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న కార్డులను రీడిజైన్ చేసి.. పాత, కొత్త లబ్ధిదారులందరికీ సరికొత్త డిజైన్‌తో అందజేయనుంది. పౌరసరఫరాల అధికారులు కొత్త డిజైన్లను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి.