News March 31, 2025
200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా క్రిస్‌గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.
Similar News
News November 15, 2025
దేశమంతా గర్వంగా ఫీలవుతుంది: మహేశ్ బాబు

వారణాసి సినిమా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని మహేశ్ బాబు తెలిపారు. ‘ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాను. అందరూ గర్వపడేలా చేస్తాను. ముఖ్యంగా రాజమౌళిని. ఇది విడుదలైన తరవాత దేశమంతా గర్వంగా ఫీలవుతుంది’ అని అన్నారు. ‘పౌరాణికం చేయమని నాన్న అడుగుతుండేవారు. ఆయన మాటలు ఎప్పుడూ వినలేదు. ఇప్పుడు ఆయన నా మాటలు వింటుంటారు’ అని గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో మాట్లాడారు.
News November 15, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 5

24. ఎల్లప్పుడూ వేగం గలదేది? (జ.నది)
25. రైతుకు ఏది ముఖ్యం? (జ.వాన)
26. బాటసారికి, రోగికి, గృహస్థునకు, చనిపోయిన వారికి బంధువులెవరు? (జ.సార్ధం, వైద్యుడు, శీలవతి అనుకూలవతి అయిన భార్య, సుకర్మ వరుసగా బంధువులు)
27. ధర్మానికి ఆధారమేది? (జ.దయ)
28. కీర్తికి ఆశ్రయమేది? (జ.దానం)
29. దేవలోకానికి దారి ఏది? (జ.సత్యం)
<<-se>>#YakshaPrashnalu<<>>
News November 15, 2025
రామాయణంలోని ముఖ్య ఘట్టంతో ‘వారణాసి’: రాజమౌళి

మహేశ్ బాబుతో తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా గురించి SS రాజమౌళి కీలక విషయాలు వెల్లడించారు. ‘ఈ సినిమా మొదలు పెట్టేటప్పుడు రామాయణంలో ముఖ్యమైన ఘట్టం తీస్తున్నానని అస్సలు అనుకోలేదు. కానీ ఒక్కొక్క డైలాగ్, ఒక్కో సీన్ రాస్తుంటే నేను నేల మీద నడవడం లేదు, గాల్లో ఉన్నానని అనిపించింది’ అని అన్నారు. మహేశ్‌కు రాముడి వేషం వేసి, ఫొటో షూట్ చేస్తుంటే గూస్బంప్స్ వచ్చాయని తెలిపారు.


