News March 31, 2025

200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

image

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్‌లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా క్రిస్‌గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.

Similar News

News April 19, 2025

శుభ ముహూర్తం (19-04-2025)(శనివారం)

image

తిథి: బహుళ షష్టి మ.1.55 వరకు.. నక్షత్రం: మూల ఉ.6.33 వరకు, తదుపరి పూర్వాషాడ.. శుభ సమయం: సామాన్యము.. రాహుకాలం: ఉ.9.00 నుంచి 10.30 వరకు.. యమగండం: మ.1.30-3.00 వరకు.. దుర్ముహూర్తం: ఉ.6.00 నుంచి 7.36 వరకు.. వర్జ్యం: శే.ఉ.6.32వరకు, పున: సా.4.30 నుంచి 6.09వరకు.. అమృత ఘడియలు: లేవు

News April 19, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

News April 19, 2025

RCBకి ఆపద్బాంధవుడిలా టిమ్ డేవిడ్

image

IPL: టిమ్ డేవిడ్ RCBకి ఆపద్బాంధవుడిలా మారారు. ఈ సీజన్‌లో టాప్ ఆర్డర్ విఫలమైన ప్రతిసారీ తానున్నానంటూ పరుగులు చేస్తూ అండగా నిలుస్తున్నారు. ఇవాళ PBKSపై RCB వికెట్లు టపటపా పడిపోయి 50 పరుగులైనా చేస్తుందా? అని అనుకున్న సమయంలో చక్కటి బ్యాటింగ్ చేసి ఆదుకున్నారు. కేవలం 26 బంతుల్లోనే 3సిక్సులు, 5ఫోర్లతో 50 బాదారు. చెన్నైపై(8బంతుల్లో 22), GTపై(18బంతుల్లో 32), DCపై(20 బంతుల్లో 37) రన్స్ చేశారు.

error: Content is protected !!