News November 19, 2024
2019 VS 2024: 7 రెట్లు ఎక్కువ డబ్బు సీజ్ చేసిన ECI
తాజా ఎన్నికల సీజన్లో రూ.1000 కోట్లకు పైగా డబ్బును సీజ్ చేసినట్టు ECI తెలిపింది. మహారాష్ట్ర, ఝార్ఖండ్ కలుపుకొని రూ.858 కోట్లు స్వాధీనం చేసుకున్నామంది. 2019తో పోలిస్తే ఈ విలువ 7 రెట్లు ఎక్కువని తెలిపింది. మహారాష్ట్రలో రూ.660 కోట్లు, ఝార్ఖండ్‌లో రూ.198 కోట్లు, బై పోల్స్ జరిగే రాష్ట్రాల్లో రూ.223 కోట్లమేర సీజ్ చేశామని వెల్లడించింది. NOV 20న తుదిదశ పోలింగ్ ఉండటంతో నిఘా ఇంకా పెంచుతామని పేర్కొంది.
Similar News
News December 9, 2024
‘INDIA’ బాధ్యతలపై చర్చ ఎప్పుడైంది?: ఒమర్
INDIA కూటమి సారథ్య బాధ్యతలు మమతా బెనర్జీకి ఇవ్వాలన్న డిమాండ్లు పెరుగుతున్న వేళ నేషనల్ కాన్ఫరెన్స్ ఆచితూచి అడుగులేస్తోంది. లోక్‌సభ ఎన్నికల తర్వాత మిత్రపక్షాల భేటీనే జరగలేదని, అలాంటప్పుడు నాయకత్వ మార్పుపై ఎవరు చర్చించారని JK CM ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. సమావేశం నిర్వహించినప్పుడు మమత సారథ్య బాధ్యతలు కోరవచ్చని, అప్పుడే ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు.
News December 9, 2024
నాగబాబుకు మంత్రి పదవి
AP: రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. జనసేన నేత నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. త్వరలోనే ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది.
News December 9, 2024
మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు
మంచు ఫ్యామిలీలో గొడవ తారస్థాయికి చేరుతోంది. తనపై దాడి చేశారంటూ కొద్దిసేపటి క్రితమే మనోజ్ పహాడీ షరీఫ్ PSలో ఫిర్యాదు చేశారు. తాజాగా తన కొడుకు మనోజ్‌పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన లేఖ రాశారు. మనోజ్‌తో పాటు కోడలు మౌనిక నుంచి తనకు ముప్పు పొంచి ఉందని, రక్షణ కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడివరకు వెళ్తుందోనని మంచు అభిమానులు చర్చించుకుంటున్నారు.